వికీలీక్స్ అస్సాంజ్ ను స్వీడన్‌ అప్పగింతకు బ్రిటిష్ అప్పిల్ కోర్టు నిర్ణయం

తనను స్వీడన్ కు అప్పగించడానికి వ్యతిరేకంగా అప్పీలు కోర్టుకు నివేదించుకున్న జులియన్ అస్సాంజ్, అక్కడ అప్పీలును కోల్పోయాడు. స్వీడన్ పోలీసులకు జులియన్ ను అప్పగించడానికి అనుకూలంగా అప్పీలు కోర్టు తీర్పునివ్వడంతో జులియన్ అస్సాంజ్ అప్పగింత అనివార్యం అయ్యింది. అయితే హైకోర్టుకు వెళ్ళడానికి జులియన్ కు ఇంకా అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదీ లేనిదీ హై కోర్టులోనే తేలనున్నది. వికీలీక్స్ అధినేత జులియన్ అస్సాంజ్ గత సంవత్సరం డిసెంబరు నెలలో బ్రిటన్ లో అరెస్టు…

‘700 కోట్ల’ వ బిడ్డకు స్వాగతం -కార్టూన్

అక్టోబరు 31 సాయంత్రంతో 700 కోట్లవ బిడ్డ జన్మించాడని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ క్రెడిట్ ని భారత్, ఫిలిప్పైన్స్ లకు చెందిన ఇద్దరు పసికందులు సంపాదించుకున్నారు. అయితే, సురక్షితమైన తల్లి గర్భం నుండి భూమ్మీదికి అడుగుపెడుతున్న పసికందులను ఆహ్వానిస్తున్నదెవరు? ఈ ప్రశ్నకు ఆకుపై వాల్ స్ట్రీట్ ఉద్యమం సమాధానం చెబుతోంది. మానవ ప్రపంచం సాధించిన అభివృద్ధికంటే ముందే ఆకలి, కరువు, దారిద్ర్యం, అందని చదువులు, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం మున్నగు సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గర్భస్త…