ఇరాన్ లో బ్రిటిష్ రాయబార కార్యాలయం విధ్వంసం -ఫొటోలు

ఇరాన్ పైన మరోవిడత అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధించినందుకు ప్రతీకారంగా ఇరాన్ విద్యార్ధులు రాజధాని టెహ్రాన్ లో గల బ్రిటిష్ రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కొద్ది వారాల క్రితం ‘అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ’ (ఐ.ఎ.ఇ.ఎ) ఇరాన్, 2001లో, అణు బాంబుని నిర్మించడానికి ప్రయత్నించిందనడానికి ఆనవాళ్ళు దొరికాయంటూ ‘అభూత కల్పనలతో’ కూడిన నివేదిక ప్రచురించింది. ఐ.ఎ.ఇ.ఎ అంటె అమెరికా తొత్తు సంస్ధ. అమెరికా గీసిన గీత దాటదు. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని…

మద్యధరా సముద్రంలో సిరియా సమీపాన మొహరించిన అమెరికా, రష్యా యుద్ధ నౌకలు

లిబియా విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, లేని తిరుగుబాటుకి సాయంగా సైనిక జోక్యం చేసుకుని చివరికి ఆ దేశ అధ్యక్షుడిని చంపి, ఆల్-ఖైదాతో కుమ్మక్కయ్యి మరీ తొత్తు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు అదే తరహాలో సిరియాలో కూడా జోక్యం చేసుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నాయి. అందులో భాగంగా అమెరికా ప్రవేశపెట్టిన అద్దె తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకుంటున్నా, పశ్చిమ పత్రికలు రోజూ అనేక అబద్ధాలని సృష్టించి, సిరియా…

మా చెక్‌పోస్టులపై దాడి చేస్తున్నామని అమెరికాకి ముందే తెలుసు -పాక్ మిలట్రీ

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పాకిస్ధాన్ చెక్ పోస్టులపైనే తాము దాడి చేస్తున్నామన్న సంగతి అమెరికా హెలికాప్టర్లకూ, జెట్ ఫైటర్లకూ ముందే తెలుసనీ, తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారనీ పాకిస్ధాన్ మిలట్రీ వ్యాఖ్యానించింది. పాకిస్ధాన్ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ ఈ మేరకు పత్రికలకు వివరాలు వెల్లడించాడు. అమెరికా హెలికాప్టర్లు పాకిస్ధానీ చెక్ పోస్టులపై దాడి చేస్తున్నారని అమెరికా బలగాలను అప్రమత్తం చేసినప్పటికీ కాల్పులు కొనసాగాయని ఆయన తెలిపాడు. పత్రికా…

రెండేళ్ళ కనిష్ట స్ధాయికి భారత ఆర్ధిక వృద్ధి

2011-12 ఆర్ధిక సంవత్సరంలో రెండో క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు 2011) లో భారత ఆర్ధిక వృద్ధి గత రెండేళ్లలో అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయింది. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో విస్తరించిన కాలంలో భారత ఆర్ధిక వ్యవస్ధ కేవలం 6.9 శాతం మాత్రమే వృద్ధి చెందిందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుదల, సంక్షోభంలో ఉన్న ప్రపంచ కేపిటల్ మార్కెట్లు అన్నీ కలిసి భారత ఆర్ధిక వృద్ధిని…

అమెరికా పాకిస్ధాన్ ల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ఆఫ్-పాక్ సరిహద్దు -ఫొటోలు

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య సరిహద్దు, ముఖ్యంగా డ్యురాండ్ లైన్ గా భావించే సరిహద్దు సరిగ్గా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లు పరస్పరం అంగీకరించిన సరిహద్దు రేఖ ఇంకా లేకపోవడమే దానికి కారణం. సరిహద్దులో ఉన్న ప్రాంతాలు ఇరు దేశాల్లో ఏ దేశానికి చెందినవన్న దానిపైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల సమస్య పరిష్కారానికి నోచుకోక అలానే పడి ఉంది. ఈ ప్రాంతాలు అమెరికాను ముప్పు తిప్పలు పెడుతున్న పష్తూన్ తెగకు చెందిన మిలిటెంట్లకు గట్టి స్ధావరాలుగా ఉండడంతో…

ఈజిప్టు ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగాయట -కార్టూన్

ఈజిప్టు నియంత ముబారక్ గద్దె దిగి పది నెలల తర్వాత అక్కడి సైనిక ప్రభుత్వం ఈజిప్టు చట్ట సభలకు ఎన్నికలు ఈరోజు నిర్వహించింది. నిన్నటి వరకూ అక్కడ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు. ఉద్యమించిన ప్రజలపై సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొన్ని వందలమందిని కాల్చి చంపింది. కొన్ని వేలమందిని అరెస్టు చేసి జైళ్లలో కుక్కింది. ఉన్న ప్రజాస్వామ్య హక్కులన్ని హరించివేసి ప్రశాంతంగా మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలను నిర్వహించింది. జనవరి ఉద్యమం డిమాండ్…

పాక్ సైనికుల హత్యకు బదులు, ఆఫ్గన్ కాన్ఫరెన్సు బహిష్కరణకు పాక్ నిర్ణయం

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ సరిహద్దు వద్ద రెండు చెక్ పోస్టుల వద్ద మొహరించి ఉన్న పాక్ సైనికులను 28 మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు చంపినందుకు నిరసనగా జర్మనీ లోని బాన్ నగరంలో జరగనున్న ఆఫ్ఘనిస్ధాన్ కాన్ఫరెన్సుకు హాజరు కాకూడదని పాకిస్ధాన్ నిర్ణయించింది. కాన్ఫరెన్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికి సంబంధించి కీలక పాత్ర పొషిస్తున్న పాకిస్ధాన్ గైర్హాజరీ లో ఆఫ్ఘనిస్ధాన్ పై కాన్ఫరెన్స్ జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. పాకిస్ధాన్ సహాయం లేనట్లయితే ఆఫ్ఘనిస్ధాన్…

అమెరికా కండకావరం: కాల్పులు ఆపమని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని వైనం

ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికాకి సహకరిస్తున్నందుకు పాకిస్ధాన్ తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సంవత్సరం క్రితం అమెరికా హలికాప్టర్ల కాల్పుల్లో ఇద్దరు సైనికులను నష్టపోయిన పాకిస్ధాన్, గత శనివారం అమెరికా హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ విమానాలు జరిపిన దాడిలో చెక్ పోస్టు వద్ద కాపలా ఉన్న 28 మంది సైనికులను (24 మంది అని ‘ది హిందూ‘, ‘ఫస్ట్ పోస్ట్‘ పత్రికలూ, 25 మంది అని ‘ది గార్డియన్‘ పత్రికా చెబుతున్నాయి) కోల్పోయిన సంగతి విదితమే. అమెరికా హెలికాప్టర్లు,…

ఆకుపైడ్, అన్‌ ఆకుపైడ్, ప్రీ ఆకుపైడ్ -కార్టూన్

బహిరంగ స్ధలాలు: నిరుద్యోగ ఉద్యమకారులతో “ఆకుపైడ్” అప్పు గృహాలు: అప్పులు తీరక బ్యాంకుల స్వాధీనం. ఫలితంగా “అన్ ఆకుపైడ్” శ్వేత భవనం: బిలియనీర్ల ఆస్తులు పెంచే కుట్రలతో “ప్రీ ఆకుపైడ్” – –

కవి ఆవిష్కరించిన ‘కిషన్ జీ’ తల్లి గుండె ముచ్చట

కొడుకు మరణ వార్త విన్న కిషన్ జీ అమ్మ ఏమని తల్లడిల్లింది? కవి ‘అజ్ఞాతి‘ ఇలా ఆవిష్కరించాడు. (బొమ్మను క్లిక్ చేసి పెద్దది చూస్తూ చదవండి)

అబద్ధాలతో ‘పాక్ సైనికుల హత్యల’ను కప్పిపుచ్చుకుంటున్న అమెరికా

పాకిస్ధాన్ లో చెక్ పోస్టు వద్ద ఉన్న పాక్ సైనికులను 24 మందిని (28 మందని ‘ది టెలిగ్రాఫ్ చెబుతోంది) చంపి, మరో 13 మందిన గాయపరిచిన అమెరికా, తన దాడులను సమర్ధించుకోవడానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అమెరికా చెబుతున్న అబద్ధాలను నిజాలుగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. గోబెల్ ను ఎప్పుడో తలదన్నిని ఈ పడమటి పత్రికలు ఆర్ధికంగా నయా ఉదారవాద విధానాలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ రాజకీయంగా అమెరికా, యూరప్…

చందమామ నుంచి జంగల్ మహల్ దాకా….

–రచన: రాజశేఖర రాజు బాల్యంలో చందమామ కథలు చదువుకున్న ఆ కుర్రవాడు చందమామ కథలు చెప్పే మంచితనం తన చుట్టూ ప్రపంచంలో కనిపించడం లేదని మనసుకు తట్టినప్పుడు సంప్రదాయాలను, బాల్యంలో ఆచరించిన ఆర్.ఎస్.ఎస్ భావాలను కూడా త్యజించి పోరుబాట పట్టాడు. ఒక బ్రాహ్మణ కుర్రాడు –నమ్మిన విశ్వాసం కొరకు నేలకొరిగిన మాన్యుడి కులం గురించి ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి– జన్మతః వచ్చిన సమస్త సంప్రదాయ విలువలను తాను నమ్మిన లోకహితం కోసం వదులుకుని తుపాకి బాట పట్టాడు. ఇల్లు,…

బూతోడు తన బూతుల్ని ఎలా సమర్ధించుకుంటున్నాడో చూడండి

meeru extreme content post chesinappudu ilantivanne common. mee abiprayalanu prjala meeda ruddite, vallaku telsindi vallu mee meeda ruddutaaru, tappadu mari. for example, ee roju CRPF gurunchi raasaaru meeru, just copy chesaaremo teleedu. kaanee vaallu prajala cheta ennukobadina valla orders paatistunnaru. we trained them like that. adi valla tappu kaadu. meeru valla chetulaki raktam antinchaaru, adi…