లిబియాలో నాటో హత్యాకాండ -గ్రాఫిక్స్‌తో వివరణ

అక్టోబరు 31 తో లిబియాపై నాటో యుద్ధం ముగిసినట్లుగా నాటో కూటమి ప్రకటించింది. యుద్ధం ముగిసింది కాబట్టి నాటో సైన్యాలు, గూఢచారులు లిబియా వదిలి పోతున్నాయనుకుంటే పొరబాటే. లిబియా జలాల్లో మొహరించిన నాటో దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు తమ పూర్వ ప్రాంతానికి వెళతాయని భావించినా పొరబాటే. ఎందుకంటె అవి అక్కడే, లిబియాపై దాడులు జరిగనంతకాలం ఎక్కడ ఉన్నాయో అక్కడే కొనసాగబోతున్నాయి. పైగా గూఢచారులు, సైనికులు మరింత స్వేచ్ఛగా బహిరంగంగా లిబియా నేలపైన సుదీర్ఘ…

3 రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ దురాక్రమణ సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లో పాశ్చ్యాత్య దురాక్రమణ సైన్యం చావు దెబ్బలు తినడం కొనసాగుతోంది. గత శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వద్ద జరిగిన భూతల దాడిలో 17 మంది సైనికులు చనిపోగా, దక్షిణ ఆఫ్ఘనిస్ధన్ లో ఆఫ్ఘనిస్ధాన్ సైనికాధికారి ఒకరు తిరగబడి ఆస్ట్రేలియా సైనికులను ముగ్గురిని కాల్చి చంపాడు. ఈ రోజు సోమవారం 4గురు విదేశీ సైనికులను కాందహార్ వద్ద తాలిబాన్ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ నలుగురితో కలుపుకుని గత మూడు రోజుల్లోనే 24 మంది దురాక్రమణ…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంతో పెరిగిన పోలీసు ఉద్యోగాలు! -కార్టూన్

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా,…