2010 సం.లో ఇండియాలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు

పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.…