16 సంవత్సరాల్లో 2.5 లక్షల రైతుల ఆత్మ హత్యలు

భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…

కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు

ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…

ముంబై దాడులపై ప్రణబ్ ముఖర్జీ మాటలకు బెంబేలెత్తిన పాకిస్ధాన్ -రైస్ ఆత్మకధ

26/11 దాడులు గా పేరు పొందిన ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కటువుగా చేసిన వ్యాఖ్యలతో పాకిస్దాన్ బెంబేలు చెందినట్లుగా అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ తన ఆత్మకధలొ పేర్కొంది. “మేము యుద్ధానికి దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు” అని ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లో మాట్లాడుతూ అనడంతో పాకిస్ధాన్ తీవ్ర స్ధాయిలో అప్రమత్తమయ్యిందని ఆమె పేర్కొన్నది. చైనా నుండి అమెరికా…

‘టచ్ స్క్రీన్’ లేని స్టీవ్ జాబ్స్ ‘ఆటో బయోగ్రఫీ’ -కార్టూన్

స్టీవ్ జాబ్స్ అనగానే యాపిల్ కంపెనీ, ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా టచ్ స్క్రీన్ గుర్తొస్తుంది. వేళ్లతో తాకి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆదేశాలివ్వడం అన్న నూతర ఒరవడికి స్టీవ్ జాబ్స్ శ్రీకారం చుట్టాడు. ఆయన ఆత్మకధను తిరగేయడానికి కూడా టచ్ స్క్రీన్ కోసం చూడడంలో వింతేమీ లేదు కదా. – ఏమిటీ?! టచ్ స్క్రీన్ లేదా!!! —