మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి
మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి…