ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!

ఇరాక్ లో అమెరికా యుద్ధం పూర్తయ్యిందట. అలా అని అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. ఇరాక్ లో అమెరికా పని పూర్తయినందున ఈ సంవత్సరాంతానికి అక్కడనుండి అమెరికా సైన్యాలన్ని వెనక్కి వస్తాయి అని ఆయన ప్రకటించాడు. “అమెరికా సైనికులు తల ఎత్తుకుని, తమ విజయాన్ని చూసి గర్వపడుతూ, సైన్యానికి మద్దతు ఇవ్వడం కోసం అమెరికా ప్రజలంతా సమైక్యంగా నిలబడి ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి ఇరాక్ ని వదిలి ఇళ్ళకు చేరుకుంటారు” అని ఒబామా ప్రకటించాడు.…

లిబియా నుండి నాటో సైన్యాలు ఇప్పుడప్పుడే వెళ్ళవు -అమెరికా

షరా మామూలే. సవాలక్ష అబద్ధాలు చెప్పడం, ప్రజస్వామ్యం స్ధాపిస్ధానని బొంకడం, బాంబులతో నాశనం చేయడం, దేశాలలో జొరబడడం, ఆ తర్వాత ఇప్పుడప్పుడే వెళ్ళేది లేదనీ ఆయా దేశాల ప్రభుత్వాలే తమను ఇంకా ఉండమని కోరుతున్నాయని నంగనాచి కబుర్లు చెప్పడం. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో సైన్యాల సాధారణ కార్యక్రమం ఇది. అదిగో లిబియాలో కూడా తిరుగుబాటు తలెత్తింది అని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గత ఫిబ్రవరిలో చెప్పాయి. కాని ప్రజలు పాల్గొన్న తిరుగుబాటుపై ఒక్క…

జపాన్ రాయబార కార్యాలయాలపై సైబర్ దాడులు

జపాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు వివిధ దేశాల్లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయాలలోని కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయని జపాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ దాడులు జూన్ నెలనుండి జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఉన్న జపాన్ కార్యాలయాలపైనా ఈ దాడులు జరిగాయని క్యోడో వార్తా సంస్ధ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలిపాయని క్యోడో ప్రకటించింది. విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని…

పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…