గడ్డాఫీ, లిబియాల గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు నిశ్చింతగా గడిపారు. అటువంటి గడ్డాఫీని చంపి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల ధనికుల ప్రయోజనాలను నెరవేరుస్తూ, వారి అడుగులకు మడుగులొత్తే తొత్తు పాలకులు లిబియాని ఏలడానికి సిద్దంగా ఉన్నారు. గడ్డాఫీ పాలనలో లిబియా ప్రజలు ఎన్ని సౌకర్యాలు అనుభవించారో తెలుసుకుంటే వారిపైన అసూయ కలుగుతుంది. లిబియాలో విద్యుత్ వాడుకున్నందుకు నెల నెలా బిల్లులు రావు. దేశ ప్రజలందరికీ విద్యుత్ ఉచితం. (కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పి ప్రజలపై బాదే అధికారులు అక్కడ…

ఇదే నా విల్లు -మౌమ్మర్ గడ్డాఫీ

ఇది నా విల్లు. మౌమ్మర్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుస్సలాం బి హుమాయ్ద్ బిన్ అబు మాన్యర్ బిన్ హుమాయ్ద్ బిన్ నాయిల్ ఆల్ ఫషి గడ్డాఫీ అను నేను, ప్రమాణం చేసి చెప్పునదేమనగా, అల్లా తప్ప మరో దేవుడు లేడు. మహమ్మద్ దేవుడి ప్రవక్త, ఆయనకు శాంతి లభించు గాక. నేను ముస్లిం గానే మరణిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నన్ను చంపేస్తే గనక, ముస్లిం సాంప్రదాయాల ప్రకారమే నన్ను పూడ్చిపెట్టాలి. చనిపోయినపుడు ఏవి ధరించి ఉన్నానో…

పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…

వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, జిడిపి వృద్ధి అంచనా తగ్గింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు మళ్ళీ పెంచింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేరకు 8.25 శాతం నుండి 8.5 శాతానికి పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డి రేట్లు పెంచక తప్పలేదని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపాడు. మార్చి 2010 నుండి ఇప్పటివరకూ పదమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు ఎందుకు పెరుగుతున్నదో కారణం మాత్రం చెప్పలేదు. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇన్నిసార్లు వడ్డీ రేట్లు…