మీ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి -యూరప్ తో చైనా
యూరప్ దేశాలు తమ రుణ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సోమవారం చైనా హెచ్చరిక లాంటి కోరిక కోరింది. యూరో జోన్ దేశాలు రుణ సంక్షోభంతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గ్రీసుకు గత సంవత్సరం బెయిలౌట్ పేరుతో ఐ.ఎం.ఎఫ్ లు సంయుక్తంగా రుణ ప్యాకేజి ప్రకటించి దశలవారీగా ఇస్తున్నాయి. ఈ లోపు గ్రీసు దేశంపైన విషమ షరతులను విధించింది. ఒక్కో రుణ వాయిదా అందుకోవడానికి కొన్ని షరతులు విధించి అవి అమలు చేస్తేనే ఒక్కొక్క వాయిదా…