టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…

యూరప్ సంక్షోభంలోనూ దండుకుంటున్న ధనికులు -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి…

రంగులను చూడడంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా -బొమ్మ

ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.…