దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!

దళితులకంటే దళితులు స్త్రీలని మరోసారి రుజువైంది. ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న ఓ ధనిక దళిత కుటుంబం తోటి పేద దళిత మహిళను నగ్నంగా గ్రామంలో ఊరేగించిన దారుణం చోటు చేసుకుంది. కక్ష సాధించే క్రమంలో డబ్బుకీ, రాజకీయ పలుకుబడికీ స్త్రీలే ప్రధమ లక్ష్యమని ఈ సంఘటన మరొకసారి చాటి చెప్పింది. విడాకులు తీసుకున్న తమ కూతురు వేరే యువకుడితో కలిసి గ్రామం నుండి వెళ్ళిపోవడానికి సాయం చేశాడని బాధిత…

ముంబై దాడులపై పాక్ కోర్టు విచారణ: దాడుల పర్యవేక్షకుని గొంతుతో పాక్ నిందితుడి గొంతు సరిపోలింది

ముంబై టెర్రరిస్టు దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులలో ఒకరి గొంతు ముంబై దాడులను పాకిస్ధాన్ నుండి పర్యవేక్షించిన వ్యక్తి గొంతుతో సరిపోలిందని పాకిస్ధాన్ పోలీసు సాక్షి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్ధాన్ కి చెందిన యాంటి టెర్రరిజం కోర్టు (ఎ.టి.సి) ముంబై దాడులపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును…

ముంబై దాడుల నిందితుడు ‘అజ్మల్ కసబ్’ ఉరి శిక్షపై స్టే విధించిన సుప్రీం కోర్టు

26/11 ముంబై దాడుల నిందితులలో సజీవంగా ఉన్న ఏకైక టెర్రరిస్టు ‘అజ్మల్ కసబ్’ కు విధించిన ఉరిశిక్ష పై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. చట్టం ఎటువంటి అరమరికలు లేకుండా తన ప్రక్రియను తాను అనుసరించడానికి వీలుగా అజ్మల్ కసబ్ అప్పీలును తాము పూర్తి స్దాయిలో విచారించదలుచుకున్నామని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అనేక సంస్ధలు, వ్యక్తులు ప్రాణాలు తీసే ఉరిశిక్షను రద్దు చేయాలనీ, ఉరి శిక్ష వలన నేరస్ధుడు తనను తాను సంస్కరించుకునే…

రోమింగ్ ఛార్జీలు లేని ‘నూతన టెలికం విధానం,’ అందరికీ బ్రాడ్‌బాండ్(అట)

కేంద్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి మంత్రి కపిల్ సిబాల్ ‘నూతన్ టెలికం విధానం’ (ఎన్.టి.పి) ప్రకటించాడు. రోమింగ్ ఛార్జిలు లేని ఈ విధానంలో ఐదు ప్రధాన అంశాలున్నట్లు ప్రకటించాడు. పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లు పైకి కనిపిస్తున్న ఈ విధానం పూర్తి వివరాలు అందితే తప్ప మంచి, చెడులను నిర్ధారించలేము. కపిల్ ప్రకటించిన ఐదు ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి. డిమాండ్ చేయడంతోనే బ్రాడ్‌బాండ్ (బ్రాడ్‌బాండ్ ఆన్ డిమాండ్) ఒక దేశం-ఒక లైసెన్సు విధానం. దీని ప్రకారం రోమింగ్…