సెప్టెంబరులోనూ కొద్ది ఉద్యోగాలే, ఇంకా క్షీణించిన అమెరికా నిరుద్యోగం

అమెరికా నిరుద్యోగ పర్వం కొనసాతోంది. ఉద్యోగలను సృష్టించడంలో ఏ మాత్రం మెరుగుదల చూపలేకపోతోంది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. బలహీన ఉపాధి లెక్కలు మరొక మాంద్యంలోకి జారిపోతుందన్న భయాలు సజీవంగా ఉంచుతున్నాయి. సెప్టెంబరు నెలకు గాను అమెరికాలో నికరంగా 103,000 ఉద్యోగాల సృష్టి జరిగినట్లుగా అమెరికా ఉపాధి నివేదిక వెల్లడించింది. ప్రవేటు రంగం 137,000 ఉద్యోగాలను సృష్టించగా, ప్రభుత్వరంగం 34,000 ఉద్యోగాలను కోల్పోయింది. అమెరికా జనాభా వృద్ధి రేటుకు తగినట్లుగా ఉద్యోగాల…

గ్రీసు కష్టాలు తీరాలంటే తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవాలి -జర్మనీ మంత్రి

యూరోపియన్ యూనియన్, ఐ.ఎం.ఎఫ్ లు గ్రీసు కోసం ప్రకటిస్తూ వచ్చిన బెయిలౌట్ల అసలు ఉద్దేశం ఎట్టకేలకు బహిర్గతమయ్యింది. గ్రీసు, రుణ సంక్షోభంలో కూరుకుపోవడంతో అవి రెండు బెయిలౌట్ల పేరుతో కఠిన రుణాలను మంజూరు చేస్తున్న సంగతి విదితమే. అత్యంత దారుణమైన షరతులతో ఇచ్చిన ఈ రుణాల ఫలితంగా గ్రీసు ఆర్ధిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. గ్రీసు జిడిపి దారుణంగా పడిపోయింది. రుణ షరతుల ఫలితంగా ప్రభుత్వ ఖర్చులలో తీవ్రంగా కోత పెట్టడంతో సంభవించిన ఫలితమిది. వారి షరతులను పూర్తిగా…