భవంతిగుండా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ హైవే, జపాన్ అద్భుతం -ఫొటోలు

సాంకేతిక అద్భుతాలకు జపాన్ పెట్టింది పేరు. సముద్ర గర్భంలో రోడ్డు రైలు మార్గాలు, హైస్పీడ్ రైళ్ళు, రోబోట్ లు మొదలైన వాటి తయారీలో జపాన్ సాదించిన పేరు ప్రతిష్టల గురించి చెప్పనవసరం లేదు. స్ధల యజమానికీ, హై వే నిర్మాణ సంస్ధకూ  తలెత్తిన వివాదం అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పరిష్కరించుకోవడం నిస్సందేహంగా గొప్ప విషయమే. ఈ భవంతిని గేట్ టవర్ బిల్డింగ్ గా పిలుస్తున్నారు. 16 అంతస్ధుల ఈ భవంతిలో లిఫ్టు 5, 6, 7 అంతస్ధుల…

తెలంగాణ అంశాన్ని కేంద్ర త్వరలోనే తేల్చేస్తుంది -సి.ఎం కిరణ్ కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కేంద్ర తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన సి.ఎం కిరణ కుమార్ రెడ్డి, డెప్యుటి సి.ఎం దామాదర రాజ నరసింహరాజు లు సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్ లతో…

ఇటలీ, స్పెయిన్ ల రేటింగ్ తగ్గించిన ‘ఫిచ్ రేటింగ్స్’

ఫిచ్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ ఇటలీ, స్పెయిన్ దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గించింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు యూరో జోన్ లో వరుసగా మూడవ, నాల్గవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కావడం గమనార్హం. ఇటలీ రేటింగ్ ఎ+ నుండి ఎఎ- కు ఒక మెట్టు తగ్గించగా, స్పెయిన్ రేటింగ్ ను ఎఎ+ నుండి ఎఎ- కు (‘ఎఎ+’ నుండి ‘ఎఎ’ ను వదిలి ‘ఎఎ-‘ కు తగ్గించడం) రెండు మెట్లు తగ్గించింది. రెండింటి ఔట్‌లుక్…

జార్జియాను బెదిరించడం మానుకోవాలి, రష్యాకు ఫ్రాన్స్ హెచ్చరిక

మూడు రోజుల కాకసస్ పర్యటనలో ఉన్న ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి చివరిగా జార్జియా పర్యటిస్తూ ఆ దేశానికి సంతోషం కలిగించే ప్రకటన చేశాడు. జార్జియ రాజధాని టిబ్‌లిసిలో వేలమంది జార్జియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నికొలస్ సర్కొజీ రష్యా తన పొరుగుదేశం జార్జియాను బెదిరించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నాడు. రష్యా తమ మిత్రదేశమేనని భావిస్తున్నామని కాని జార్జియాను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. 2008లో జార్జియా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని…