అమెరికాలో “వాల్ స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం” ఉద్యమ హోరు
అమెరికాలో ఇప్పుడు “ఆకుపై వాల్‌స్ట్రీట్” ఉద్యమం హోరెత్తిస్తోంది. అరబ్ దేశాల్లో ప్రజా ఉద్యమాలని అణచివేయడానికీ అది వీలు కాకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడానికీ పావులు కదపడంలో బిజీగా ఉన్న అమెరికా తన ప్రజలు ఈజిప్టు ఉద్యమం తరహాలో చేస్తున్న ఉద్యమంతో కూడా సతమతమవుతోంది. అమెరికాలో నిరసనకారులు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమం చేయకపోవచ్చు గానీ అక్కడి ప్రజల్లో అమెరికా అవినీతి ప్రభుత్వంపైనా, విఫలమైన వ్యవస్ధపైన దాచిపెట్టుకున్న వ్యతిరేకత, ఎదుర్కొంటున్న నిరాశా నిస్పృహలు నిరసనల రూపంలో, “వాల్‌స్ట్రీట్‌ని ఆక్రమిద్దాం”…