సిరియా సంస్కరణలకు అమెరికాయే అడ్డం -కార్టూన్

అరబ్ ప్రజల ప్రజాస్వామిక విప్లవ ఆకాంక్షలను ఆసరా చేసుకుని అమెరికా వేలుపెట్టిన దేశాల్లో లిబియా మొదటిది కాగా సిరియా రెండవది. వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఎప్పటినుండో కన్నేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ ల బద్ధ శత్రువు ఇరాన్‌కు మిత్ర దేశంగా, పాలస్తీనాలో గాజాలో ప్రభుత్వం నడుపుతున్న హమాస్ సంస్ధకు మద్దతుదారుగా ఉన్న సిరియాలో తమ అనుకూల ప్రభుత్వం నిలపాలని అవి వేయని ఎత్తుగడా, పన్నని పన్నాగాలు…

ప్రధాని పదవి కోసం బిజెపిలో అప్పుడే పోరు మొదలు

సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగానే బి.జె.పి లో పదవీ కుమ్ములాటలు మొదలైనట్లు కనిపిస్తోంది. శుక్ర, శనివారాలలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హాజరు కాకుండా ఎగవేయడంతో ఈ కుమ్ములాటలు బైటికి వచ్చాయి. మోడి రాకపోవడాన్ని బి.జె.పి ప్రతినిధులు చిన్నవిషయంగా కొట్టి పారేస్తున్నప్పటికీ ఆయన గైర్హాజరీకి వారు ఇచ్చిన కారణాలు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడంలోనే అసలు విషయం వెల్లడవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో రాజకీయ పరిస్ధితిపై…

బూటకంగా తేలిపోయిన నరేంద్రమోడి “సద్భావన”

“శాకాహారం మాత్రమే భోంచేస్తానని” మూడు రోజుల పాటు సద్భావనా మిషన్ నిర్వహించిన పులి గారు తన దీక్ష విరమించి నెలరోజులు కూడా కాక మునుపే తన “మాంసాహార” లక్షణాలను దాచి ఉంచుకోలేకపోయింది. తనకు తెలిసిన నిజాన్ని వెల్లడి చేసిన పొలీసు అధికారి సంజీవ్ భట్ పై కానిస్టేబుల్ చేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అరెస్టు చేసింది. కనీసం ఆయన భార్యను గానీ, లాయర్ ను గానీ కలవనీయకుండా నిర్భంధించింది. “నిన్నటి నుండీ సంజీవ్ ను కలవడానికి నన్ను…

“దైవ దూషణ” హత్య నిందితుడికి పాక్ కోర్టు మరణ శిక్ష

“దైవ దూషణ”కు పాల్పడ్డాడంటూ పాకిస్ధాన్ లోని రాష్ట్ర గవర్నర్ ను దారుణంగా కాల్చి చంపిన పోలీసు అధికారికి పాకిస్ధాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్ధాన్ లో ‘దైవ దూషణ’ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఆటంకాలని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని తస్సీర్ ప్రచారం చేశాడు. బ్లాస్ఫెమీ నేరానికి శిక్ష పడ్డ ఆసియా బీబీ అనే వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం…

రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా

పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు…