అజారుద్దీన్ కొడుకుని చంపిన రేస్ బైక్ ఇదే

అజారుద్దీన్‌కు మొదటి భార్యతో కలిగిన కుమారుడు ఆయాజుద్దీన్ ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివార్లలో నూతనంగా నిర్మిస్తున్న రింగ్ రోడ్డుపైన రేస్ బైక్ ను వేగంగా నడుపుతూ చక్రం జారిపోవడంతో ఆయాజుద్దీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెనక సీట్లో కూర్చున్న అతని బంధువు అక్కడే మృతి చెందగా ఆయాజుద్ధీన్ ఆసుపత్రిలో కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈ ఘటన పట్ల చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. కొడుకు…

“నెగిటివ్ సందేశాలు పంపొద్దు” అమెరికాని కోరిన పాక్ ప్రధాని

అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు. “ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో…

పాక్‌కు అన్ని సాయాలు బంద్, అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

పాకిస్ధాన్‌కు అన్ని సహాయాలు బంద్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడొకరు ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. టెక్సాస్ నుండి ఎన్నికైన సభ్యుడొకరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన అమెరికా ప్రతినిధుల సభలో కీలక సభ్యుడని డెయిలీ భాస్కర్ పత్రిక పేర్కొంది. ఈ తీర్మానం కాంగ్రెస్ లో ఆమోదం పొందినట్లయితే అమెరికా, పాకిస్ధాన్ కు అందజేస్తున్న అన్ని సహాయాలు స్తంభించిపోతాయి. పాకిస్ధాన్ అణ్వస్త్రాలను భద్రపరచడానికి అందిస్తున్న సహాయాన్ని దీన్నుండి మినహాయించాడు. కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో, తాను ప్రవేశపెట్టిన…

దరిద్రులకోసం పైసల్లేని అమెరికా సర్కార్ -కార్టూన్

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ యుద్ధాల కోసం ఏడు ట్రిలియన్ డాలర్లు, ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతులైన బడా బహుళజాతి సంస్ధలకు బెయిలౌట్లు ఇవ్వడం కోసం 14 ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టిన అమెరికా ప్రభుత్వం, దరిద్రులకు విదిలించడానికి నాణేల కోసం వెతుక్కుంటోంది. – కార్టూన్: హెంగ్, సింగపూర్ —

సి.ఐ.ఎ కి ఇష్టమైన నీలి కళ్ల బాలుడే హక్కానీ నెట్ వర్క్ -పాక్ మంత్రి హీనా రబ్బానీ

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది. రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు…

ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న…