జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని అమెరికా ఎంబసీ పై రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడి హక్కాని గ్రూపు మిలిటెంట్లే చేశారని అమెరికా భావిస్తోంది. ఈ దాడి వెనుక పాకిస్ధాన్ ఆర్మి ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందని కూడ అమెరికా అనుమానిస్తోంది.

హక్కాని గ్రూపుని మట్టుబెట్టాలని అమెరికా ఎప్పటినుండో పాకిస్ధాన్ ను డిమాండ్ చేస్తొంది. ఆ గ్రూపుతో పాక్ ఆర్మీ సత్సంబంధాలు నెరుపుతూ ఆఫ్ఘనిస్ధాన్‌లో తన అనుకూల సంస్ధగా తీర్చి దిద్దుకుంటున్నదని ఆరోపిస్తొంది. ఈ ఆరోపణలను పాకిస్ధాన్ తిరస్కరిస్తోంది. తమ వద్ద ఉన్న వనరులన్నింటినీ ఇప్పటికే వినియోగిస్తున్నామనీ, అమెరికా చెబుతున్నట్లుగా హక్కానీ గ్రూపుపై దాడులు చేయడానికి అవకాశం లేదని పాకిస్ధాన్ ఆర్మీ పేర్కొంటున్నది.

హక్కానీ గ్రూపుతో శతృత్వం పెట్టుకుంటే పాకిస్ధాన్ కోలుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. హక్కానీ గ్రూపుకి పాకిస్ధాన్ ఆఫ్ఘనిస్ధాన్ సరిహద్దు కొట్టిన పిండి అనీ, అనేక ఇతర ముస్లిం గ్రూపులతో దానికి సత్సంబంధాలు ఉన్నాయనీ, అటువంటి గ్రూపుని అణచివేయాలని పాకిస్ధాన్ తలపెడితే అది చాలా దెబ్బతినవలసి ఉంటుందని, నష్టాలు మూటగట్టుకుంటుందని వారు తేల్చి చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే పాక్ ప్రభుత్వం, ఆర్మీలు హక్కాని గ్రూపుపై అమెరికా కోరినట్లుగా దాడులు చెయడానికి వెనకడుగు వేస్తున్నాయి.

పాకిస్ధాన్ ఆర్మీ ఛీఫ్ అష్ఫక్ కయాని ఆదివారం తన కమేండర్లతో ఎమర్జన్సీ సమావేశం ఏర్పాటు చేసి పాకిస్ధాన్ భద్రతా విషయాలపై సమీక్ష చేసాడు. హక్కానీ గ్రూపును ఐ.ఎస్.ఐ సంస్ధ పెంచి పోషిస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్న నేపధ్యంలోనే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. హక్కానీ గ్రూపు ఆశ్రయం పొందుతున్నట్లుగా అమెరికా అనుమానిస్తున్న ఉత్తర వజీరిస్తాన్‌పై పాకిస్ధాన్ ఆర్మీ దాడులు చేయాలంటున్న అమెరికా డిమాండ్లను ప్రతిఘటిస్తామని పాక్ కమేండర్లు అంగీకరించినట్లుగా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. “ఇప్పటివరకూ చేసినదానికంటె ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేది లేదని అమెరికాకి ఇప్పటికే స్పష్టం చేశాము” అని పాకిస్ధా ఆర్మీ అధికారి తెలిపినట్లుగ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.

హక్కాని గ్రూపు నాయకుడు సిరాజుద్ధీన్ హక్కానీ తమకు పాకిస్ధాన్‌లో ఆశ్రయం పొందవలసిన అగత్యం ఇపుడు లేదనీ నిజానికి పాక్‌లో కంటే ఆఫ్ఘనిస్ధాన్‌లోనే తమకు ఎక్కువ భద్రత ఉందనీ ప్రకటించాడు. హక్కానీ గ్రూపు చేతిలో అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు అనేకసార్లు చావుదెబ్బ తిన్నాయి. దానితో హక్కాని గ్రూపు పేరు చెబితేనే దురాక్రమణ సేనలకు వణుకుపుడుతోంది. తమ వల్ల కాక పాకిస్ధాన్ పైన ఒత్తిడి తెస్తూ హక్కానీ గ్రుపుకి మద్దతు ఉపసంహరించాలని ప్రయత్నిస్తొంది. ఒత్తిడిలో భాగంగా అమెరికా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కూడా హక్కాని గ్రూపుతూ ఐ.ఎస్.ఐకి సంబంధాలున్నాయని సెనేట్ కమీటీ ముందు ఆరోపించాడు. కాని అమెరికా ఒత్తిడిని పాకిస్ధాన్ అంతే తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on సెప్టెంబర్ 26, 2011 by in అవర్గీకృతం and tagged , , .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు

Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
Manohar on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
చందుతులసి on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
apnewscorner on మాయావతి (బి.ఎస్.పి) ప్రయాణం…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
suresh on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
sai bhargav on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
Nivas on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
mohan on ఇజ్రాయెల్ జాత్యహంకారానికి దర్ప…
Thirupalu on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…
విశేఖర్ on విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ…
విశేఖర్ on రు. 4 లక్షల కోట్ల పన్ను ఎగేసిన…

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 547గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 399,926 సార్లు

క్యాలెండరు

సెప్టెంబర్ 2011
సో మం బు గు శు
« ఆగ   అక్టో »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 547గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: