రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం

2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి. అయితే…

పాలస్తీనా రాజ్య ప్రకటనకు ఇజ్రాయెల్ ఆటంకం -కార్టూన్

అరవై ఏళ్ళనుండి ఇజ్రాయెల్ రాజ్య జాత్యహంకార ప్రభుత్వం కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజలు విముక్తి పొందకుండా అమెరికా, యూరప్ లు కాపలా కాస్తూ వచ్చాయి. జాత్యహంకార పదఘట్టనల కింద నలుగుతున్న పాలస్తీనా ప్రజల తరపున ఇజ్రాయెల్, అమెరికాలతో కుమ్మకయిన వెస్ట్ బ్యాంక్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా దేశం ఏర్పాటును ఏక పక్షంగా సమితి సమావేశాల్లో ప్రకటిస్తానని కొన్ని నెలలుగా చెబుతూ వచ్చాడు. సేవకుడు ఎంత సేవ చేసినా యజమానులకు తృప్తి దొరకదు. అబ్బాస్ ఎన్నిమార్లు ఇజ్రాయెల్…

హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని…