అతి చేస్తే ఫ్రెండ్‌షిప్ ఉండదు, జాగ్రత్త! అమెరికాకి పాక్ హెచ్చరిక

పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని అమెరికాని ఘాటుగా హెచ్చరించింది. పదే పదే పాకిస్ధాన్ పైన టెర్రరిస్టులతో సంబంధాలున్నాయనీ, పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ ఇటీవల అమెరికా ఎంబసీపై దాడికి సాయం చేసిందనీ అమెరికా ఆరోపణలు చేస్తుండడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. టెర్రరిజంపై యుద్ధంలో పాకిస్ధాన్ డబుల్ గేమ్ ఆడుతోందని పదే పదే ఆరోపణలు చేసినట్లయితే ఒక మిత్రుడిని అమెరికా కోల్పోవలసి ఉంటుందనీ పాక్ విదేశాంగ మంత్రి హైనా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో…

జి20 సమావేశాలు మొదలు, రేపటికల్లా శుష్క వాగ్దానాల వరద

జి20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యింది. అమెరికా, యూరప్‌ల రుణ సంక్షోభాలు ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వ్యవస్ధలను, షేర్ మార్కెట్లను వణికిస్తున్న నేపధ్యంలో జి20 సమావేశాలు జరుగుతున్నాయి. 1990ల చివర్లో జి20 గ్రూపు ఏర్పడినప్పటికీ మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో దాని ప్రాధాన్యత పెరిగింది. సంక్షోభం ప్రారంభంలో వరుసగా సమావేశాలు జరిపిన జి20 గ్రూపు, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించి ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యం నుండి…

అద్భుతమైన ఊటి ఫోటోలు, కట్టి పడేస్తాయి

ఫేస్ బుక్ ‌లో ఓ మిత్రుడు ఈ ఫొటోలను ప్రచురించాడు. ఊటిలో తీసినవట. ఇవెంత బాగున్నాయంటే, వీటిని నా బ్లాగులో తిరిగి ప్రచురించడం ద్వారా నాకు అందుబాటులో ఉంచుకోకుండా ఉండలేకపోయాను.  

లిబియాలో వందల పౌరుల్ని పొట్టన బెట్టుకుంటున్న నాటో దాడులు

గడ్డాఫీ లిబియా విడిచి పారిపోయాడని చెబుతున్నప్పటికీ నాటో వైమానిక దాడులు ఆగ లేదు. దుష్టత్రయం ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ తమ ఆయిల్ దాహం తీర్చుకోవడానికి లిబియా పౌరుల రక్తాన్ని తోడేయడం ఆపలేదు. గత కొద్ది రోజులలోనే వందలమంది సిర్టే నగర పౌరుల్ని నాటో వైమానిక దాడులు పొట్టనబెట్టుకున్నాయి. లిబియా పౌరుల్ని గడ్డాఫీ నుండి రక్షిస్తామని వైమానిక దాడులు ప్రారంభించిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు గడ్డాఫీ దేశంలో లేకుండా చేస్తున్న వైమానిక దాడులు ఎవర్నుండి పౌరుల్ని రక్షించడానికి…