రూపాయి విలువ అడ్డం పెట్టుకుని మోస పూరితంగా పెట్రోల్ రేట్లు పెంచిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్ ధరలను లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే తగ్గిపోయినందున కంపెనీలు దిగుమతులకు ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదనీ దానివలన నష్టాలు పెరిగాయనీ కారణం చూపి ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచింది. కాని వాస్తవానికి రూపాయి విలువ తగ్గుదల తాత్కాలిక పరిణామమేననీ కొద్దిరోజుల్లోనే రుపాయి పూర్వ విలువను పొందుతుందనీ ప్రభుత్వ అధికారులే నాలుగురోజుల క్రితం ప్రకటిన సంగతి గమనిస్తే, ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అబద్ధాలు…

హోటల్ మెయిడ్‌తో నా ప్రవర్తన నైతిక పతనమే -స్ట్రాస్ కాన్

ఐ.ఎం.ఎఫ్ మాజి మేనేజింగ్ డైరెక్టర్ స్ట్రాస్ కాన్ జైలునుండి బైటకు వచ్చాక మొదటిసారి నోరు విప్పాడు. హోటల్ మెయిడ్‌పైన తాను బలవంతం చేయనప్పటికీ ఆమెతో తన ప్రవర్తన నా నైతిక పతనమేనని అంగీకరించాడు. “భారత దేశ రాజకీయ నాయకుడు స్ట్రాస్ కాన్ ఉన్న పరిస్ధితిలో ఉన్నట్లయితే, మొత్తం ఘటననే పెద్ద అభద్దం అని బొంకి ఉండేవాడు. అసలు అటువంటిది ఏమీ జరగనే లేదనీ, మెయిడ్‌ని తానసలు ఇంతవరకూ చూడనేలేదనీ అనేక ఒట్లు పెట్టి ఉండేవాడు. కావాలంటే బహిరంగ…

ఆర్.బి.ఐ రేట్ల పెంపుతో పతనమైన షేర్ మార్కెట్

శుక్రవారం జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక సారి వడ్డీ రేట్లను పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదనీ, ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమనీ ఆర్.బి.ఐ గవర్నర్ మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి పెరుగుదల రేటుకు ప్రతికూలంగా పరిణమించడంతో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని ప్రధాని ఆర్ధిక…

అతి భారీ కూరగాయలు -ఫొటోలు

సెప్టెంబరు 16 తేదీన ఉత్తర ఇంగ్లండులోని హారొగేట్ పట్టణంలో “హారోగేట్ ఆటమన్ ఫ్లవర్ షో జరిగింది. ఇది ఈ సంవత్సరం వందవ ప్రదర్శన జరుపుకుంటోంది. ఈ సారి ప్రదర్శనలో అతి భారీ కూరగాయల ప్రదర్శన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో సాగుదారులు పోటీలు పడి ప్రదర్శనలో పాల్గొన్నారు. సాగుదారుడు డెరెక్ న్యూమన్ తన భారీ కేబేజి తో ప్రదర్శనకు వస్తున్నాడు. పీట్ గ్లేజ్ బ్రూక్, 8.15 కిలో గ్రాముల ఉల్లిపాయతో ఆశ్చర్యపరిచాడు