భాష, సోషలిజం, ప్రజాస్వామ్యం – పరస్పర సంబంధాలు -2

కనపడేవీ, కనపడనివీ అన్నీ గ్రహించాలి వ్యవస్ధల మార్పులు మనిషి కంటికి కనపడే పరిధిలోనివి కావు. వ్యవసాయంలో ఒక పంట కాలం కొద్ది నెలలు ఉంటుంది. దుక్కు దున్నడం, నాట్లు వేయడం, పంటకు రావడం, కోత కోసి పంట అమ్ముడుబోయి డబ్బులు చేతికి రావడం వరకూ మన కళ్లెదుటే జరిగే పరిణామం. కనుక మనిషి విత్తుదశనుండి పంట చేతికి వచ్చేవరకు జరిగే పరిణామాలను గుర్తించగలుగుతాడు. అలాగే మనిషి పుట్టుక, పెరుదల, చదువు సంధ్యలు, పెళ్ళి, పునరుత్పత్తి, సంతానం సాకడం,…

కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం…

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా

చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది. భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది.…

ఇదీ ఇండియా -యాహూ ఫొటోలు పార్ట్ 2

యాహూ వార్తల వెబ్ సైట్ దేశంలోని ఫోటో గ్రాఫర్ల నుండి ‘ఇదీ ఇండియా’ అంశంపై ఫోటోలను ఆహ్వానించింది. వాటిలో కొన్ని ఎన్నుకుని ప్రచురించింది. బ్లాక్ అండ్ వైట్ ధీమ్ లో ఉన్న ఆ ఫోటోలే ఇక్కడ కూడా. — —

దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ

దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో…