అమెరికా ఆర్ధికవృద్ధి మందగమనం + బడా బ్యాంకులు = జీరో ఆర్ధిక వృద్ధి -కార్టూన్

న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” బడా బ్యాంకులే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను గొప్ప మాంద్యం (ది గ్రేట్ రిసెషన్) లోకి జారడానికి దోహదపడ్డాయి. సబ్ ప్రైమరీ హౌసింగ్ రుణాలను అతిగా సెక్యూరిటైజేషన్ చేసి తాజా కేకులుగా ప్రపంచం అంతా అమ్మి ద్రవ్య సంక్షోభంలోకి ప్రపంచాన్ని తోశాయి. అందుకు వారికి శిక్షకు బదులు ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల రూపంలో నజరానాలు అందాయి. అవి అందుకున్న బెయిలౌట్లు, రెండు యుద్ధాలు కలిసిన అమెరికా అప్పు, హిమాలయాలతో…

ఢిల్లీ బాంబు పేలుడు – అనుమానితుల ఊహా చిత్రాలు

ఢిల్లీ బాంబు పేలుడు దుర్ఘటనలొ ఢిల్లీ పోలీసులు అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వీటిని ఫస్ట్ పోస్ట్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా గీసిన చిత్రాలివి. —

ఢిల్లీ బాంబు పేలుడు -ఫోటోలు

బుధవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు గేటు వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనలో 11 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్ధితి విషమంగా ఉందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 25 తేదీన ఇదే కోర్టు ప్రాంగణంలో తక్కువ శక్తితో బాంబు పేలింది. ఆ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ఈ రోజు జరిగిన బాంబు పేలుడుకి మే నెలలో జరిగిన పేలుడు ట్రయల్ గా…

ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, అఫ్జల్ గురు విడుదల కోసం? (అప్‌డేట్స్)

ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు, ఐదవ గేట్ల మధ్య శక్తివంతమైన బాంబు పేలిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 11 కి పెరిగిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం గం.10:14ని.లకు పేలిన ఈ బాంబు పేలుడు ఘటన ఢిల్లీలో నాలుగు నెలల్లో రెండవది. మే25 తేదీన, ఇదే హైకోర్టు ప్రాంగణంలో పాలిధీన్ కవర్ లో పెట్టిన తక్కువ తీవ్రతతో కూడిన బాంబు పేలింది. ఆ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. ఓ కారు స్వల్పంగా దెబ్బతినడం తప్ప…

అదేదో హిల్లరీతో తేల్చుకోండి, మాయవతితో ‘వికీలీక్స్’ జులియన్

మాయావతి దూషణలకు వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ స్పందించాడు. అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ లో ఉన్న అంశాలతో సమస్య ఉన్నట్లయితే, మాయావతి, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌తో తేల్చుకోవాలని చెప్పాడు. అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి రాసిన కేబుల్ లో మాయవతిని ‘గర్వం ప్రదర్శించే’ వ్యక్తిగా పేర్కొన్నాడు. తనను ఎవరో హత్య చేయనున్నారన్న ఆలోచనతో తన ఆహారాన్ని రుచి చూడడానికి ఇద్దరిని నియమిందుకుందనీ, తొమ్మిది మంది వంటవాళ్ళు ఉన్నారనీ, తనకు నచ్చిన బ్రాండు…

ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, 9 మంది దుర్మరణం

ముంబై బాంబు పేలుళ్ళ అనంతరం టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళలో కనీసం 9 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారు. పేలుళ్ళకు తామే బాధ్యులమని ‘తెహరీక్’ అనే సంస్ధ ప్రకటించినప్పటికీ కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇప్పుడే చెప్పలేమని ప్రకటించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ బాంబు పేలుళ్ళు పిరికిపందల చర్య అని వ్యాఖ్యానించాడు. యధావిధిగా ‘మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు…