జైల్లో “గాలి”

‘గాలి’ గారిని జైల్లో బంధించడం సాధ్యమవుతుందని నెల రోజుల క్రితం వరకూ ఎవరూ భావించి ఉండరు. కాని దేశంలోని దర్యాప్తు సంస్ధలను వాటిమానాన వాటిని పనిచేయనిస్తే ఒక్క “గాలి” గారినేం ఖర్మ, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న యువరాజు గార్లను కూడా బంధించ వచ్చు. ఆ సంగతినే సి.బి.ఐ రుజువు చేస్తోంది. ఈ క్రియాశీలత ఎన్నాళ్ళుంటుందో తెలియదు కాని, ఒక్కప్పుడు ఊహించనలవి కాని దృశ్యాలను భారత ప్రజ ప్రత్యక్షంగా, టి.వి ఛానెళ్ళలో సంతృప్తిగా, సంతోషంగా, కసిగా, కావలసిందే అన్నట్లుగా…

యు.ఎస్ ఆర్ధిక సంక్షోభం పోనేలేదు, రుణ సంక్షోభం చుట్టుముడుతోంది – కార్టూన్

అమెరికాలో ఉన్న “టూ బిగ్ టు ఫెయిల్” కంపెనీలు ప్రజల పన్నులు, ప్రభుత్వ అప్పులు మెక్కి సంక్షోభం నుండి కోలుకున్నప్పటికీ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. బడా కంపెనీలు, ముఖ్యంగా ప్రవేటు ఇన్‌వెస్ట్‌మెంటు బ్యాంకులు, ఇన్సూరెన్సు సంస్ధలు బెయిలౌట్లుగా ప్రభుత్వ అప్పులను భోంచేయడంతో అమెరికా ప్రభుత్వానికి అది పెనుభారమై కూర్చుంది. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగం పెరిగి అధిక ఉత్పత్తి సంక్షోభానికి దారి తీస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం పైన అనుమానాలు, అప్పు…

మాయావతి ఓ అనుమాన పిశాచి, డిక్టేటర్ -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఒక అనుమాన పిశాచి అనీ, డిక్టేటర్‌ను పోలి ఉండే అలవాట్లు గల వ్యక్తి అనీ అమెరికా రాయబారి, అమెరికా ప్రభుత్వానికి పంపిన కేబుల్‌లో పేర్కొన్న సంగతి వికీలీక్స్ ద్వారా వెల్లడయ్యింది. “పోర్ట్రయిట్ ఆఫ్ ఎ లేడీ” అన్న హెడ్డింగ్‌తో రాసిన ఈ కేబుల్‌లో మాయావతి దళిత కార్డుని ఉపయోగిస్తున్నప్పటికీ ఆమె ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి చేస్తున్నదేమీ లేదనీ, అభివృద్ధికి సైతం చేస్తున్నదేమీ లేదని రాయబారి పేర్కొన్నాడు. 2007 నుండి 2009 వరకూ…

బంగ్లాదేశ్‌కు రు.3375 కోట్ల రుణం మంజూరు చేసిన ఇండియా

ఓ వైపు బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తగుదునమ్మా అని తనకు మాలిన ధర్మాన్ని అనుసరిస్తోంది. భారత దేశంలో రోడ్లు, రైల్వేలు లాంటి మౌలిక రంగాల నిర్మాణం ఆధినిక సౌకర్యాలతో లేనందున సరఫరా నష్టాలు ఏర్పడి ధరలు పెరుగుతున్నాయనీ, దానితో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్నదనీ ప్రధాని మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెబుతున్నారు. ఆ పేరుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం నిధులు సంపాదించడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండులను గత…

అక్రమ మైనింగ్‌పై సి.బి.ఐ కొరడా, గాలి జనార్ధన్, మరొకరి అరెస్టు

గాలి బ్రదర్స్‌లో నాయకత్వ పాత్రలో కనిపించే గాలి జనార్ధన రెడ్డి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓ.ఎం.సి) ఎం.డి బి.శ్రీనివాస రెడ్డిలను సి.బి.ఐ సోమవారం అరెస్టు చేసింది. సి.బి.ఐ డెప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వి.వి.లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం బళ్ళారి చేరుకుని స్వయంగా గాలి జనార్ధన రెడ్డి, బి.శ్రీనివాస రెడ్డిలను అరెస్టు చేసి రోడ్డు మార్గంలో హైద్రాబాద్ కి తీసుకువచ్చారు. ఇద్దరిని అరెస్టు చేశామని సాయంత్రంలోగా సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామనీ సి.బి.ఐ ప్రతినిదులు తెలిపారు. గాలి జనార్ధన…

ముంబై దాడుల దోషి హేడ్లీ అప్పగింతకు ఇండియా సీరియస్‌గా లేదు -మాజీ భద్రతాధికారి

ముంబై దాడుల నిందితుడు హేడ్లీని అమెరికానుండి ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ కింద ఇండియాకి రప్పించడానికి, భారత ప్రభుత్వం అంత సీరియస్ గా లేదని అమెరికా రాయబారితో చెప్పిన విషయం వికీలీక్స్ వెల్లడించిన కేబుల్ ద్వారా బైటపడింది. లష్కర్ ఎ తొయిబా సభ్యుడు డేవిడ్ కోలమన్ హేడ్లీని ఇండియాకి రప్పించడానికి అమెరికాపై ఒత్తిడి చేసున్నట్లు పైకి కనిపించినప్పటికీ వాస్తవానికి ‘ఈ సమయంలో’ హేడ్లీని రప్పించడానికి భారత్ సిద్ధంగా లేదని భారత ప్రభుత్వ మాజీ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ అమెరికా…