అరబ్ జాతి ఒకానొక కలని సాకారం చేసుకున్నవేళ… వీడియో, కార్టూన్

మొత్తం అరబ్ జాతికే రోమాంఛిత క్షణాలవి. ప్రతి అరబ్బుకీ ఒళ్ళు పులకరించి, గుండెలనిండా తాజా ఊపిరి నిండిపోయి, మనసంతా ఉద్విగ్నతతో అల్లుకుపోయిన క్షణాలవి. జన్మంతా రీప్లే వేసుకుంటూ చూసుకోగల దృశ్యమది. అటువంటి అద్భుతమైన ఘటనను ఈజిప్టు యువకులు సాధించారు. పాలస్తీనా ప్రజలు తమ ఇళ్ళు, గ్రామాలు కోల్పోయి, అరవై ఏళ్లనుండి ఇజ్రాయెల్, అమెరికాల జాత్యహంకార ముట్టడిలో  అన్ని ప్రజాస్వామిక హక్కులకు దూరమై రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నారు. తమ ఇంటి కోసం, తమ వీధికోసం, తమ గ్రామం కోసం,…

పౌరుల శవాల సాక్షిగా లిబియాలో “నాటో తిరుగుబాటు” పరిపూర్తి -కార్టూన్

నాటో బలగాలు నాయకత్వం వహించిన “లిబియా తిరుగుబాటు” పూర్తయ్యిందని అమెరికా ప్రకటించింది. ఇన్నాళ్లూ లిబియా ఆయిల్ వనరులపై అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లకు సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలిపోయినట్లుగా పత్రికలు ప్రకటించాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఇన్నాళ్ళూ నేరుగా కుట్రలకు పాల్పడి, ప్రభుత్వాధిపతుల ఇళ్లపై బాంబులు జారవిడిచి తమ అనుకూల ప్రభుత్వాలను నిలబెడుతూ వచ్చిన అమెరికా, యూరప్ దేశాలు లిబియాలో వినూత్న పద్ధతిని అవలంబించాయి. “తిరుగుబాటు” అని ప్రచారం చేసి అది…

చుక్కల్లో ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం చుక్కల్లో విహరిస్తోంది. రెండంకెల సంఖ్యను చేరువగా వెళుతోంది. అంటే దేశంలో ఆహార ధరలు కూడా చుక్కల్లో విహరిస్తున్నాయని అర్ధం. ఆహార భద్రత గురించి గుర్తొచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు దంచే ప్రధాని మన్మోహన్ అది సాధించడానికి ఏ చర్యా తీసుకోడు. మంత్రులు, అధికారుల అవినీతి జన్ లోక్ పాల్ బిల్లువలన ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళన తప్ప దేశంలో ప్రజానీకానికి తిండిని అందుబాటులో ఉంచాలన్న ధ్యాస లేదు. ఆగస్టు 13 తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 9.8…