అన్నా దీక్ష విరమణకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం?

అన్నా బృందానికీ, ప్రభుత్వానికి మద్య విభేధాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న ఊహాగానాలు ఆదివారం వెలువడ్డాయి. మాహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ ప్రభుత్వాధికారి ఆదివారం అన్నాను కలవడంతో ఈ ఊహాగానాలు బయలుదేరాయి. అన్నా హజారే మహారాష్ట్ర వాసి కావడం ఈ సందర్భంగా గమనార్హం. సదరు అధికారి, అన్నాల మధ్య జరిగిన చర్చలను “వ్యక్తిగతమైనవి”గా అన్నా బృందం అభివర్ణించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. ఐతే ప్రధానిని, ఉన్నత న్యాయ వ్యవస్ధను లోక్ పాల్…

అన్నాకి గురువైనందుకు మహాత్మాగాంధి సైతం జైల్లోకే -కార్టూన్

కేంద్ర ప్రభుత్వం అన్నా హజారే అంటేనే ఉలిక్కిపడుతోంది. దీక్ష మొదలు కాక ముందే అన్నా బృందాన్ని అరెస్టు చేసి చేతులు కాల్చుకుంది. నాలిక్కరుచుకుని విడుదల చేయబోయి అక్కడా దెబ్బతిన్నది. మరోపక్క అన్నా హజారే తన అరెస్టునే ఆందోలనకు అనువుగా మార్చుకోగలిగాడు. అన్నా బృందం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ఈ కార్టూన్‌ని భారతీయ కార్టూనిస్టు మంజుల్ గీసింది. – “అన్నా హజారేకి ఆయనే గురువని ప్రభుత్వానికి తెలిసిందట మరి!” —

అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ డూప్ తో -తాలిబాన్

తాలిబాన్ పేరు చెప్పి మోసం చేస్తున్న డూప్ వ్యక్తితో అమెరికా చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రకటించి సంచలనం సృంష్టించింది. తాలిబాన్ తరపున అమెరికాతో చర్చలు జరుపుతున్నాడని వ్యక్తి నిజానికి తమ వద్దనే ఉన్నాడని చెబుతూ, సదరు వ్యక్తి ఇంతవరకు ఎప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి వెళ్ళలేదని తాలిబాన్ వెల్లడించింది. తాలిబాన్‌కి చెందిన ఉన్నత స్ధాయి అధికారితో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపామంటూ ప్రకటించిన అమెరికాకు ఇది ఆశనిపాతం లాంటి వార్తే. తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆదివారం…