రాహుల్ జోక్యంతో విడుదల ఉత్తర్వులు, విడుదలకు నిరాకరిస్తున్న హజారే

అన్నా హాజారే అరెస్టు పాలక కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలనే సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో పాత నెహ్రూవియన్ విధానాలకీ, గత రెండు సంవత్సరాలుగా వేళ్ళూనుకున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాల రూపకర్తలకూ మధ్య గల విభేధాలు అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంగా మరొక్కసారి వెల్లడయ్యాయి. అన్నా హజారేని ఉదయాన్నే అరెస్టు చేయించిన చిదంబరం, మన్మోహన్ ల ముఠా తీరా అరెస్టు చేసాక తలెత్తిన వ్యతిరేకతతో డంగైనట్లుగా కనిపిస్తున్నది. హజారే బృందాన్ని అరెస్టు చేశేవరకూ అనుకున్నట్లు సాగినా వారిని…

విడుదలైన కిరణ్ బేడి, శాంతి భూషణ్ లు, మరికొద్ది నిమిషాల్లో హజారే కూడా?

తీహార్ జైలుకి తరలించబడ్డ పౌర సమాజ కార్యకర్తలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఐ.బి.ఎన్ ఛానెల్ ప్రకటించింది. విడుదలయ్యాక కిరణ్ బేడీతో చేసిన ఇంటర్వూ ఆడియోని కూడా ఐ.బి.ఎన్ ప్రసారం చేసింది. ఏం జరిగిందీ తనకు తెలియదనీ మమ్మల్ని మాత్రం విడుదల చేశారనీ కిరణ్ బేడీ తెలిపింది. కిరణ్ బేడీతో పాటు సీనియర్ లాయర్ శాంతి భూషణ్ కూడా విడుదలయ్యారు. ఇంకా ఇతర పౌర సమాజ కార్యకర్తలయిన అరవింద్ కేజ్రీవాల్, సిసోడియాలు విడుదలైందీ లేనిదీ అన్నా…

హజారే అరెస్టుపై రెండు వారాల్లో నివేదిక కావాలి -జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్

భారత దేశ ప్రజల మానవ హక్కులను కాపాడవలసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓ విషాధకరమైన జోక్ పేల్చింది. శక్తివంతమైన లోక్ పాల్ బిల్లు కోసం శాంతియుతంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారేతో పాటు ఆయన మద్దతుదారులను అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా మానవహక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దానికి స్పందించింది. అన్నా హజారే, అతని మద్దతుదారుల అరెస్టుపై రెండు వారాల్లొగా నివేదిక సమర్పించాలని హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కమిషన్ కోరింది.…

అన్నా హజారే అరెస్టుపై దేశ వ్యాపిత స్పందన -ఫోటోలు

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందు ప్రవేశపెట్టాలనీ, లోక్ పాల్ పరిధిలోనికి ప్రధాని, ఛీఫ్ జస్టిస్ లను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పౌర సమాజ కార్యకర్త అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టడంతో పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం పోలీసులు విధించిన షరతులను నిరాకరించడంతో అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, కిరణ్ బేడీ లను కోర్టు ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ పరిణామాల క్రమంలొ దేశవ్యాపితంగా…

హజారేతో పాటు నలుగురికి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, తీహార్ జైల్లో ఉంచే అవకాశం

ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నా హజారే, ఆయన బృందంలోని సభ్యులైన కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషన్ లకు ప్రత్యేక మెజిస్టీరియల్ కోర్టు ఏడు రోజుల పాటు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జయప్రకాష్ నారాయణ పార్కులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా హజారే ప్రకటించడంతో ఆయనని అరెస్టు చేశామని ఢిల్లీ పొలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నా హజారే వ్యక్తిగత బాండు సమర్పించడం ద్వారా బెయిల్ పొందవచ్చునని కోర్టు షరతు…

అన్నా హజారే తిరస్కరించిన ఆరు ఫాసిస్టు షరతులు ఇవే

సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకు తేవాలనీ, ప్రధాని, న్యాయ వ్యవస్ధలను కూదా లోక్ పాల్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టాడు. అయితే అన్నాహజారే నిరాహార దీక్షకు కూర్చోకముందే ఆగస్టు 16 తేదీన పొద్దున్నే  పోలీసులు ఆయనని అరెస్టు చేసి పట్టుకెళ్ళారు. వ్యక్తిగత ష్యూరిటి ఇవ్వడానికి హజారే నిరాకరించడంతో హజారేకి ఆరు రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. తాము విధించిన షరతులను హజారే అంగీకరించక…

ఆగష్టు 15 న రాజ్‌ఘాట్ వద్ద అన్నా హజారే దీక్ష -ఫొటోలు

ఆగష్టు 15, 2011 తేదీన అన్నా హజారే తలవని తలంపుగా గాంధీ సమాధి వద్ద ప్రత్యక్షమయ్యారు. ముందుగా సమాచారం లేని సందర్శన కావడంతో పోలీసులు తొలుతు హడావుడి పడినా తర్వాత సర్దుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని చాలా రోజుల్నిండి హెచ్చరిస్తూ వస్తున్న అన్నా హజారే రాజ్ ఘాట్ వద్ద ఆపని చేయడానికి వచ్చాడేమో నని పోలీసులు కంగారు పడ్డారని తెలిసింది. స్వతంత్రం భారతంలో నాయకుల అవినీతి పెచ్చుమీరడం పట్ల తన ప్రార్ధనలో ఆవేదన చెందానని ఆయన…

అన్నా హజారే అరెస్టు, నిర్బంధంలోనే నిరవధిక నిరహార దీక్ష ప్రారంభం

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. అవినీతిపై తన పద్ధతిలో సమర శంఖం పూరించిన అన్నా హజారేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించకముందే అరెస్టు చేశారు. 74 ఏళ్ళ అన్నా హజారేను 7:30 గంటలకే ఆయన ఉంటున్న  తూర్పు ఢిల్లీలోని అపార్ట్‌మెంటుకి వెళ్ళి అరెస్టు చేశారు. మొదట దీక్ష విరమించాలని నచ్చజెప్పిన పోలీసు అధికారులు, అందుకాయన ససేమిరా అనడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వేలమంది మద్దతుదారులతో దీక్షకు కూర్చుంటున్నానని హజారే చెప్పినందున ముందస్తు జాగ్రత్తగా…