ఒలింపిక్ జ్యోతి రాకమునుపే తగలబడుతున్న లండన్ -కార్టూన్

2012 ఒలింపిక్ ఆటల సంరంభానికి ఇంకా సంవత్సరం మిగిలే ఉంది. ఒలింపిక్ ఆటలు నిర్వహిస్తామని పోటీపడి గెలిచిన లండన్ నగరం అప్పుడే తగలబడిపోతోంది. దశాబ్దాల తరబడి అసమానతకీ, అవమానాలకీ గురైన తొట్టెన్ హామ్, ఇంకా అలాంటి ప్రాంతాల యువత ఉగ్ర రూపం దాల్చి అల్లర్లై లండన్ నగరాన్ని తగలబెడుతోంది. “లూటీలూ, దహనాలతో మీరు సాధించిందేమిటి?” అని అడిగిన విలేఖరులకి “వేలమందిమి శాంతియుత ప్రదర్శనలు చేసినా అస్సలు పట్టించుకోని మీరు మా దగ్గరికి వచ్చి మరీ ఇప్పుడెందుకా ప్రశ్నని…

జగన్ అరెస్టు కావొచ్చు, ఆస్తులూ పోవచ్చు -న్యాయ నిపుణులు

దేవుడి పాలనలో ఒక వెలుగు వెలిగిన దైవ కుమారుడికి కష్టాలు వచ్చిపడ్డాయి. న్యాయ వ్యవస్ధ క్రియాశీలంగా మారడం వల్లనో లేదా అది తను నిజానికీ చేయవలసిన పని నిజాయితీగా చేస్తున్నందునో దొంగ దేవుళ్ళ పాపాల సామ్రాజ్యాలు కూలుతున్న  శబ్దాలు వినపడుతున్నాయి. అవి పాపాల రాయుళ్ళకు కర్ణ కఠోరంగా ఉంటే, ఆ పాపాలలో సమిధలయిన సామాన్య మానవునికి వీనులవిందుగా తోస్తోంది. న్యాయ నిపుణులు ‘ముందుంది మొసళ్ల పండగ’ అంటున్నారు. జగన్‌ పాల్పడ్డాడంటున్న నేరాలను బట్టి చూస్తే భవిష్యత్తులో జగన్…

నీతికి కట్టుబడ్డ పోలీసు అధికార్లపై సి.ఎం మోడి కక్ష సాధింపు!

గోధ్రా రైలు దుర్ఘటనను అడ్డు పెట్టుకుని గుజారాత్ లో ముస్లింలపై నెలరోజులకు పైగా నరమేధాన్ని సాగించిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, ఇప్పుడు, తాను సాగించిన ఘోర కృత్యాలకు సాక్ష్యాలను విచారణా కమిషన్ కు అందిస్తున్నందుకు పోలీసు అధికారులను శిక్షించడానికి నిస్సిగ్గుగా తెగబడుతున్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ముస్లింల మారణకాండకు స్వయంగా ఆదేశాలిచ్చాడనీ, అ ఆదేశాలిచ్చిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నాననీ అయినా తన స్టేట్ మెంట్ ను విచారణ కమిషన్ రికార్డు చేయడం లేదని సుప్రీం…

రుణ సంక్షోభంలో ఫ్రాన్సు కూడా! పతనబాటలో అమెరికా, యూరప్ షేర్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ ప్రభావం నుండి తేరుకుని మంగళవారం అమెరికా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలు చవి చూశాయి. కాని ఆ ఆనందం బుధవారానికి అవిరైపోయింది. యూరోజోన్‌లో రెండవ శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధ కలిగి ఉన్న ఫ్రాన్సు కూడా యూరప్ అప్పు సంక్షొభం బారిన పడనుందని అనుమానాలు బలంగా వ్యాపించాయి. దానితో యూరప్, అమెరికా ల షేర్ మార్కెట్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు గురైనాయి. రుణ సంక్షోభం దరిమిలా ఫ్రాన్సు క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోతుందన్న…