రాహుల్ రేటింగ్ AAA, మన్మోహన్ రేటింగ్ AA+ -కార్టూన్

అట్లాంటిక్ సముద్రానికి అవతల ఒడ్డున అమెరికా రేటింగ్‌ని, స్టాండర్డ్ & పూర్ సంస్ధ AAA నుండి AA+ కి తగ్గించింది. హిందూ మహా సముద్రానికి ఇవతలి ఒడ్డున భారత ప్రజలు ప్రధాని మన్మోహన్ రేటింగ్‌ని AAA నుండి AA+ కి తగ్గించేశారు. అదే చేత్తో ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ రేటింగ్ లు ఏమీ లేని రాహుల్ గాంధీకి అమాంతం AAA రేటింగ్ ఇచ్చేశారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ మరియు సి.ఎన్.బి.సి-టి.వి18 సంస్ధల  ‘స్టేట్ ఆఫ్ ది నేషన్ పోల్’ ను,…

ఈజిప్టు, ట్యునీషియా తిరుగుబాట్లకు ట్విట్టర్, ఫేస్ బుక్ లు సహాయపడ్డాయనడం నిజం కాదు

ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేట్ పత్రికలు ప్రచారం చేసినట్లు ఈజిప్టు ఉద్యమ నిర్మాణంలో ట్విట్టర్, ఫేస్ బుక్ ల పాత్ర ఏమీ లేదు. ఉద్యమ వార్తలను ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రాసుకున్నారు గానీ ఉద్యమ వ్యాప్తికి అవేమీ ఉపయోగపడలేదు. అసలు ట్విట్టర్,  ఫేస్ బుక్ ల ద్వారా ఉద్యమాలు వస్తాయనడమే పెద్ద తప్పు, మోసం కూడా. కేవలం ఇంటర్నెట్ లో సందేశాలతో ఉద్యమ కాంక్షలను రగిల్చే పనైతే ఫేస్ బుక్ లో కాజ్ ల పేరుతో…

14(F) రద్దుకు బందు సరే; కె.సి.ఆర్-కాంగ్రెస్ నాటకాల బందు ఎన్నడు?

పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం హైద్రాబాదును ఫ్రీ జోన్ గా పరిగణిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన 14(F) ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ బందు విజయవంతమైనట్లుగా వార్తలు తెలుపుతున్నాయి. తెలంగాణ విద్యార్ధుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర తెలంగాణ ప్రజా సంఘాల మద్దతుతో తెలంగాణ బందును విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వార్తా ఛానెళ్ళు ప్రకటించాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులనుండి 14(F) క్లాజును తొలగించాలని తెలంగాణ విద్యార్ధులు, తెలంగాణ…

సైబర్ దాడుల దోషులు అమెరికా, ఇండియాలే – చైనా

హ్యాకింగ్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. హ్యాకింగ్ లాంటి సైబర్ దాడులకు అసలు కారకులు అమెరికా, ఇండియాలేనని చైనా ఆరోపించింది. గత ఐదు సంవత్సరాలనుండి ప్రపంచంలోని అనేక ప్రభుత్వాల వెబ్‌సైట్లు, ప్రముఖుల ఈ మెయిళ్ళు పెద్ద ఎత్తున హ్యాకింగ్ కి గురయ్యాయని మెకేఫీ సైబర్ సెక్యూరిటి సంస్ధ వారం క్రితం వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి, తైవాన్, ఇండియా, దక్షిణ కొరియా, వియత్నాం, కెనడా, ఏసియాన్, ఐ.ఒ.సి, తదితర 72 సంస్ధలు హ్యాకింగ్ కి గురయ్యాయని చెబుతూ, దీని వెనుక…