అమెరికా రేటింగ్ తగ్గింపుతో నిలువునా కూలుతున్న అమెరికా, యూరప్ షేర్ మార్కెట్లు

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గింపుతో ప్రపంచంలోని అన్ని దేశాల షేర్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. జపాన్‌ని భూకంపం, సునామీలు తాకిన రీతిలో ఎస్&పి అమెరికా రేటింగ్ తగ్గింపు, ప్రపంచ షేర్ మార్కెట్లను తాకింది. సోమవారం ఇండియా షేర్ మార్కెట్లను దాదాపు రెండు శాతం పైగా లోయలోకి తోసేసిన ఈ పరిణామం యూరప్ షేర్ మార్కెట్లను రెండు నుండి నాలుగు శాతం వరకూ పతనం చేసింది. ఇక అమెరికా షేర్ మార్కెట్లు సైతం రెండున్నర నుండి మూడున్నర శాతం…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు. అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా…

యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్

అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే భారత దేశానికి నష్టకరం -ప్రణాళికా సంఘం

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తే దాని ప్రభావం ఇండియాపై తీవ్రంగానే ఉంటుందని భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఒక ఇంటర్వూలో తెలిపాడు. సి.ఎన్.బి.సి-టి.వి 18 ఛానెల్ వారు అహ్లూవాలియాతో ఇంటర్వ్యూ చేసినపుడు ఆయన అమెరికా క్రెడిట్ రేటింగ్ కోత గురించి తన అభిప్రాయాలు తెలిపాడు. ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం వలన పారిశ్రామిక దేశాల్లో ఉద్భవించే ఏకైన సానుకూల పరిణామం, కమోడిటీ (సరుకుల) ధరలపైన ఒత్తిడి పెరగడమేనని తెలిపాడు. కానీ ఇండియాకి వచ్చేసరికి,…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -1

ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఒక మెట్టు తగ్గించింది. అమెరికా మార్కెట్లనుండి ట్రేజరీ బాండ్ల వేలం ద్వారా అప్పు సేకరించే విషయం తెలిసిందే. ఆ విధంగా అప్పు సేకరించడానికి జారీ చేసే బాండ్ల రేటింగ్‌ను ఎస్ & పి తగ్గించింది. ఇలా అప్పులకి రేటింగ్ ఉండడం ఏంటో చాలా మందికి అర్ధం కాని విషయం. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించేవరకూ ఈ రేటింగ్‌ల విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. భారత ప్రభుత్వం…