తాలిబాన్ రాకెట్ దాడిలో 38 మంది అమెరికా సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లోని సెంట్రల్ మైదాన్ వార్డాక్ రాష్ట్రంలోని సైదాబాద్ లో తాలిబాన్ ఫైటర్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) తో 38 మంది సైనికులున్న ఛినూక్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లుగా తాలిబాన్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఛినూక్ హెలికాప్టర్ కూలిపోయిందనీ, కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో 31 మంది అమెరికా సైనికులు కాగా 7గురు ఆఫ్ఘన్ కమేండర్లనీ తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం మొదలయ్యాక ఒకే సంఘటనలో…

అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గుదల తీవ్రమైన విషయమే -ఆర్ధిక మంత్రి ప్రణబ్

భారత ప్రభుత్వ ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అమెరికా క్రెడిట్ రేటింగ్ ని ఎస్ & పి రేటింగ్ సంస్ధ తగ్గించడంపై శనివారం స్పందించాడు. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించడం “తీవ్రమైన విషయమే” అని అభివర్ణించాడు. అయితే విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందనీ, అది సరైంది కాదనీ ఆయన వ్యాఖ్యానించాడు. “అమెరికా క్రెడిట్ రేటింగ్‌ని డౌన్ గ్రేడ్ చేసిన చర్యని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. దానికి కొంత సమయం కావాలి. విషయాలు పూర్తిగా…

అసలు ఎస్ & పి విశ్వసనీయత ఎంత? తనదాకా వచ్చాక అడుగుతున్న అమెరికా

తనదాకా వస్తేగాని అర్ధం కాలేదు అమెరికాకి. ఒక దేశానికి చెందిన క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే ఏమిటో అమెరికా అధికారులకి, కాంగ్రెస్ సభ్యులకీ, సెనేట్ నాయకులకీ ఇప్పుడు అర్ధం అవుతోంది. అది కూడా పాక్షికంగానే. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించాక మాత్రమే ఎస్ & పి కి ఉన్న విశ్వసనీయతపైన అమెరికాకి అనుమానాలు వస్తున్నాయి. యూరప్, ఆసియా లకు చెందిన అనేక బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలతో పాటు దేశాల సావరిన్ అప్పులకు కూడా రేటింగ్ లను…

రుణ సంక్షోభంపై అమెరికాని లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన చైనా

రుణ సంక్షోభాన్ని అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న పద్దతిపై చైనా మొదటిసారిగా స్పందించింది. సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుని తీవ్రంగా ఎండగట్టింది. కనీసం కామన్ సెన్స్ కూడా లేదని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. డాలర్ ఆధిపత్యం వహించే రోజులు పోయాయని హెచ్చరించింది. ఇలాగే ఉంటే మరో కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా ఎన్నుకోవాల్సి ఉంటుందని క్లాస్ పీకింది. ఆర్దిక వ్యవస్ధని అప్పులపై ఆధారపడి నడపడాన్ని ఎద్దేవా చేసింది. అమెరికా రుణ సంక్షోభం నుండి బైటపడడానికి రాజకీయ పక్షాలు జరిపిన చర్చలు…

టాప్ క్రెడిట్ రేటింగ్ AAA ను కోల్పోయిన అమెరికా

భయపడిందే జరిగింది. నెలల పాటు రుణ పరిమితి పెంపు కోసం, బడ్జెట్ లోటు తగ్గంపు కోసం సిగపట్లు పట్టుకుని చివరిదాకా తేల్చలేకపోయినందుకు అమెరికా ట్రెజరి జారీ చేసే రుణ బాండ్ల (సావరిన్ డెట్ బాండ్లు) రేటింగ్‌ను స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ తగ్గించింది. అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ ను AAA నుండి AA+ కు తగ్గించింది. ప్రపంచ దేశాలు జారీ చేసే ట్రెజరీ బాండ్లలో అమెరికా బాండ్లకే అత్యధిక రేటింగ్ ఉంది. ట్రెజరీ బాండ్లు…