అబ్బే, అమెరికా కాంగ్రెస్ పనితీరు సరిగా లేదు -అమెరికా ప్రజలు

అమెరికా ప్రజలు అమెరికా కాంగ్రెస్ (House of Representatives or Congress) పనితీరుని అత్యధిక సంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనంత అధిక స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ లోని రిపబ్లికన్ సభ్యులు, డెమొక్రట్ సభ్యులు రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచాలనీ, బడ్జెట్ లోటుని 2.1 ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనీ ఒప్పందం కుదుర్చుకుని చట్టాన్ని ఆమోదించాక జరిపిన సర్వేలో అమెరికా ప్రజల్లో 82 శాతం మంది కాంగ్రెస్ పనితీరు బాగాలేదని తేల్చారు. న్యూయార్క్…

కుప్ప కూలిన షేర్ మార్కెట్లు, వణికిస్తున్న అమెరికా, యూరప్ సంక్షోభాలు

శుక్రవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 383.31 పాయింట్లు (2.19 శాతం) నష్టపోయి 17305.87 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచి 120.55 పాయింట్లు (2.26 శాతం) నష్టపోయి 5211.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఒక దశలో సెన్సెక్స్ మానసిక స్ధాయి17000 పాయింట్లకు తక్కువగా 16990.91 వరకూ పడిపోయి ఆ తర్వాత కోలుకుంది. నిఫ్టీ కూడా ఓ దశలో 5200 పాయింట్లకు తక్కువగా 5116.45 వరకూ పడిపోయి అనంతరం కోలుకుంది. అమెరికా రుణ సంక్షోభం, యూరప్ సావరిన్ అప్పు…

ఒక్క వారంలో $2.5 ట్రిలియన్లు నష్టపోయిన ప్రపంచ షేర్ మార్కెట్లు

ఈ ఒక్క వారంలోనే ప్రపంచ షేర్ మార్కెట్లు మొత్తం 2.5 ట్రిలియన్లు నష్టపోయాయని రాయిటర్స్ తెలిపింది. ఇది రు.1.125 కోట్ల కోట్లకు లేదా రు.1,12,50,000 కోట్లకు సమానం. ఫ్రాన్సు వార్ధిక స్ధూల జాతీయోత్పత్తి కూడా సరిగ్గా ఇంతే ఉంటుంది. ఒక ప్రధాన అభివృద్ధి చెందిన దేశ జిడిపితో సమానంగా ప్రపంచ షేర్ మార్కెట్లు ఈ ఒక్క వారంలోనే (ఆగస్టు 1 నుండి 5 వరకు) నష్టపోయాయన్నమాట! ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ “డబుల్ డిప్” వైపుకి మరొక “ది…

భారీ నష్టాల్లో షేర్ మార్కెట్, శుక్రవారం 400 పాయింట్ల పైగా పతనం

ఈ వారం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. వ్యాపారం ప్రారంభమైన గంటలోపే 400 పాయింట్లకు పైగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ నష్టపోయింది. ఇది దాదాపు 2.4 శాతానికి సమానం. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 2.4 శాతం నష్టపోయి 17,268 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 2.4 శాతం నష్టపోయి 5204 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్, ఇటలీలకు పాకవచ్చునని అనుమానాలు విస్తృతం కావడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరోసారి…