సర్వేలో ‘జన లోక్‌పాల్’కు 80% మద్దతు, ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ సవాల్

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ నియోజక వర్గం ‘చాందినీ చౌక్’ పార్లమెంటరీ నియోజక వర్గంలో అన్నా హజారే బృందం లోక్ పాల్ డ్రాఫ్టులపై సర్వే నిర్వహించిన సంగతి విదితమే. సర్వేలో ప్రభుత్వ డ్రాఫ్టు ‘లోక్ పాల్’ బిల్లు, అన్నా బృందం రూపొందించిన ‘జన్ లోక్‌పాల్’ బిల్లులు వివిధ ప్రధాన అంశాలపై ఏమేం ప్రతిపాదిస్తున్నదీ ఉదహరిస్తూ, అందులో ఏ అంశాలకు తాము మద్దతు ఇస్తున్నదీ గుర్తించవలసిందిగా కోరారు. మొత్తం 4 లక్షల కుటుంబాలలో అన్నా…

కొనసాగుతున్న షేర్ల పతనం

భారత షేర్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అమెరికా రుణ పరిమితి పెంపుపై సోమవారం ఒప్పందం కుదరడంతో లాభాలు పొందిన షేర్ మార్కెట్లు, మంగళవారం పాత భయాలు తిరిగి తలెత్తడంతో నష్టాలకు గురయ్యాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి నెమ్మదించడం, యూరప్ లోని బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో అప్పు సంక్షోభంపై తిరిగి ఆందోళనలు తలెత్తడం, భారత ఆర్ధిక వృద్ధికి అధిక ద్రవ్యోల్బణం ప్రతిబంధకంగా మారడం… ఇవన్నీ రంగం మీదికి రావడంతో షేర్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.…

అబ్బే, నేనసలు ల్యాప్ టాపే మొయ్యను, పగిలిందెప్పుడు? -వెంకయ్య నాయుడు

ఆగ్రహంతో ఉన్న యెడ్యూరప్ప తన ల్యాప్ టాప్ ను లాక్కొని విసిరేసి పగలకొట్టాడని మీడియాలో వచ్చిన వార్తను వెంకయ్య నాయుడు ఖండించాడు. తానసలు లాప్ ట్యాప్ ని మోసే పనిని పెట్టుకోననీ ఇక మరొకరు లాక్కొని పగలగొట్టే పరిస్ధితే తలెత్తదనీ వెంకయ్య నాయుడు అన్నాడు. తనకు మద్దతు ఇస్తూ రాసిన లేఖలో సంతకం పెట్టడానికి నిరాకరించడంతో అగ్రహంతో వెంకయ్య నాయుడు చేతిలోని ల్యాప్ టాప్ లాక్కొని నేలకేసి విసిరి కొట్టినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టు…

ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు…

అమెరికా రుణ పరిమితి పెంపుకు ఒప్పందం, ప్రతినిధుల సభ ఆమోదం

ఆగస్టు 2 లోగా అమెరికా రుణ పరిమితిని పెంచుతూ చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్న నేపధ్యంలో అనేక వారాల పాటు చర్చలు, తర్జన భర్జనలు జరిగాక ఎట్టకేలకు, అమెరికా ప్రతినిధుల సభ లోని డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ మధ్య ఆగస్టు 1 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన “ది బడ్జెట్ కంట్రోల్ యాక్ట్ 2011” ను  సభ్యులు 269-161 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన…

ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…