‘పులి పాప’ను పాల డబ్బాతో సాకుతున్న ‘పిల్ల చింపాంజీ’ -ఫొటోలు

మనిషికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హోమో సెపియన్ కి అత్యంత దగ్గరి పోలికలు ఉన్నది చింపాంజీకే నని జీవ శాస్త్రవేత్తలు చెబుతారు. చింపాంజీల చేష్టలు, అలవాట్లు, వివిధ అవసరాల కోసం అవి చూపించే కదలికలు, కొద్ది ముఖంలో కూడా ప్రతిఫలించే హావ భావాలు… ఇవన్నీ ఆ విషయం నిజమేనని స్పష్టం చేస్తాయి కూడా. పేదల ఇళ్ళల్లో తల్లి దండ్రులు పని చేయగల వారినందర్నీ కూలి పనులకు పట్టుకుపోతే, ఇంట్లోనే ఉండక తప్పని చంటి పాపను, పాపకంటే నాలుగో,…

మరింత క్షీణిస్తున్న భారత ఆర్ధిక వృద్ధి, లక్ష్య సిద్ధి అనుమానమే

భారత దేశ ఆర్ధిక వృద్ధి మరింత క్షీణిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉత్పత్తి పెరుగుదల రేటు తగ్గిపోతుండడంతో జి.డి.పి వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే తక్కువే నమోదు కావచ్చని ప్రభుత్వంలోని ఆర్ధిక సంస్ధలు, పరిశీలకులు భావిస్తున్నారు. దానితో గతంలో విధించుకున్న జిడిపి వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రభుత్వం తగ్గించుకుంటోంది. జి.డి.పి వృద్ధితో పాటు మార్చి 2011 నాటికి చేరాలని భావిస్తున్న బడ్జెట్ లోటు (ఫిస్కల్ డెఫిసిట్), ద్రవ్యోల్బణం తదితర లక్ష్యాలను కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది.…

ఫుకుషిమా శుభ్రతకు దశాబ్దాలు, అణు పరిశ్రమకు అంతం పలకాలని కోరుతున్న జపాన్

“జపాన్ కాంగ్రెస్ ఎగైనెస్ట్ అటామిక్ అండ్ హైడ్రోజన్ బాంబ్స్” మొదటి సమావేశం, భూకంపం, సునామీల వలన అణు ప్రమాదం సంభవించిన ఫుకుషిమాలో సోమవారం ప్రారంభమయ్యింది. అణు విద్యుత్ పరిశ్రమకు ఇక అంతం పలకాలని ఆ సదస్సు కోరింది. అణు విద్యుత్ కానీ, అణు బాంబులు కానీ ఏవీ వాంఛనీయం కాదనీ రెండూ మానవాళికి ప్రమాదకారులేననీ సమావేశం తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 9 పరిమాణంతో మార్చి 11 న ఫుకుషిమా దైచి అణు ప్లాంటు వద్ద సంభవించిన…