లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో…

మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం

కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9, 2009 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు ఏలూరు ఎం.పి. కావూరు సాంబశివరావు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ తర్వాత ఆయన చేస్తూ వచ్చిన దురహంకార పూరిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ట ఎంత నేలబారుదో వెల్లడి చేశాయి. కొద్ది నెలల క్రితం తెలంగాణ లాయర్లు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినపుడు పోలీసులు సృష్టించిన హడావుడి ఉద్రిక్తతకు దారితీసింది. అప్పుడు కావూరివారు “రెండు కాకపోతే…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…

లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…