ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం!?

గత శనివారం ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ అకస్మాత్తుగా అమెరికాపైన విరుచుకు పడ్డాడు. అమెరికాకి చెప్పకుండానే అమెరికా తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించిందనీ, చర్చలు కొనసాగుతున్నాయని కూడా పత్రికలకు చెప్పేశాడు. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ కూడా తాము తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంగీకరించవలసి వచ్చింది. పనిలో పనిగా ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్, ఆల్-ఖైదాలపై గల ఆంక్షలు, నిషేధాల జాబితాను విడదీస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. ఆ తీర్మానానికి ఇండియా కూడా…

పునరాగమనంలో ఎమోషనల్ ఐపోయిన టెన్నిస్ రాణి సెరెనా విలియమ్స్ -ఫోటోలు

పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉండే ఫ్రొఫెషనల్ లాన్ టెన్నిస్ రంగంలోకి సెరెనా, వీనస్ సోదరీమణుల రాక ఓ సంచలనం. గ్రౌండ్‌లో అడుగు పెట్టిన ప్రతిసారీ సింహనాదాలతో చెలరేగే చిన్న విలియమ్స్ సెరెనా, ఈ సారి మొదటి రౌండ్ గెలవడంతోటే ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యింది. 13 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను సొంతం చేసుకున్న 29 ఏళ్ళ సెరెనా, ఈ ఏడు వింబుల్డన్ టెన్నిస్ లోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగు పెట్టకముందు 49 వారాల పాటు టెన్నిస్‌కి దూరంగా…

సింగూరు భూమి పునః స్వాధీనంపై కోర్టుకెళ్తాం -టాటా మోటార్స్

లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన త్రిణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల కూటమి సింగూరు భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. చెప్పినట్లుగానే సింగూరులో రైతులనుండి బలవంతంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకు స్వాధీనం చేయడానికి వీలుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి చట్టం కూడా ఆమోదించింది. అయితే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ద్వారా సింగూరు భూమిని వశం చేసుకున్న టాటా మోటార్స్ సంస్ధ…

అమెరికా, గ్రీసు దేశాలు సమయానికి అప్పు చెల్లించలేక పోవచ్చు -ఫిచ్ రేటింగ్స్

అమెరికా, గ్రీసు దేశాల అప్పు చెల్లింపుల సామర్ధ్యం పైన ఫిచ్ రేటింగ్స్ సంస్ధ మరొకసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు నెలలో రెండు దేశాలు తాము జారీ చేసిన సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ చెల్లింపులతో పాటు కొన్నింటికి మెచ్యూరిటీ చెల్లింపులు చేయవలసి ఉంది. అమెరికా అప్పుపై ఉన్న గరిష్ట పరిమితికి ఇప్పటికే చేరుకున్నందునా, గ్రీసు మరో విడత పొదుపు బడ్జెట్‌ను ప్రజల తీవ్ర వ్యతిరేకత వలన ఆమోదించలేక పోతున్నందున ఐ.ఎం.ఎఫ్, ఇ.యులు ఆ దేశానికి ఇవ్వవలసిన…