పోస్కో వ్యతిరేక ఆందోళన తీవ్రతరం, పిల్లలు మహిళలతో మూడంచెల ప్రతిఘటన వ్యూహం

ఒడిషాలొని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 24 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్ పూర్ గ్రామాలను బహుళజాతి ఉక్కు కంపెనీ కోసం వశం చేసుకోవడానికి ప్రయత్నాలను తీవ్ర్రం చేసింది. దాదాపు 3000 ఎకరాల్లోని అటవీ భూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైనే అక్కడ ఉన్న…

షేర్ మార్కెట్లకు ఈ వారం కూడా నష్టాలే!

ఈ వారం షేర్ మార్కెట్లూ నష్టాల్లోనే… భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 మాత్రమే (ఏప్రిల్ 2010 లో ఇది 13.1 శాతం) పెరుగుదలను నమోదు చేయడంతో శుక్రవారం షేర్ మార్కెట్లు నష్టాల్ని చవి చూశాయి. వారం మొత్తం చూసినా షేర్లు నస్టాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 116.36 పాయింట్లు (0.63 శాతం) 18,268.54 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 35.25 పాయింట్లు (0.64 శాతం) 5,485.8 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్…

$2 బిలియన్లు నష్టమైనా ఎగుమతుదారులపై పన్నుల రద్దుకు నిర్ణయించిన ప్రభుత్వం

ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నప్పటికీ ఎగుమతిదారులకు ఇస్తున్న టాక్స్ బ్రేక్ కొనసాగించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నందున ఎగుమతిదారులపై విధించిన పన్ను రద్దు స్కీంను కొనగాగించకూడదని నిర్ణయించింది. ఐతే ఎగుమతిదారులైన భారత బిలియనీర్లు తీవ్రంగా అభ్యంతర పెట్టడంతో వారి ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తిరగదోడి ఎగుమతిదారులను సంతృప్తి పరిచింది. ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి “డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్ బుక్” (డి.ఇ.పి.బి)…

అమెరికా సైనికుల బూట్లు పాక్ నేలను తాకడానికి వీల్లేదు -సి.ఐ.ఏ తో పాక్ ఆర్మీ

సి.ఐ.ఏ గూఢచారులను 2/3 వంతు మందిని పాకిస్ధాన్ నుండి పంపించడంతో, ఆ విషయం చర్చించడానికి సి.ఐ.ఏ అధిపతి లియోన్ పెనెట్టా చెప్పా పెట్టకుండా పాకిస్ధాన్‌కి విచ్చేశాడు. పాక్ మిలట్రీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం పాకిస్ధాన్ లో మొత్తం 135 మంది సి.ఐ.ఏ గూఢచారులు ఉండగా వారిలో 90 మందిని అమెరికాకు తిప్పి పంపారు. పాకిస్ధాన్ భూభాగంలో రక్షణ పొందుతున్న ఆల్-ఖైదా, తాలిబాన్ స్ధావరాలపై డ్రోన్ దాడులు జరపడానికి పాకిస్ధాన్ లో నియమించబడిన సి.ఐ.ఏ గూఢచారులు అందించే…