జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ వార్తా విశేషాలు

“సిరియా అణు కార్యక్రమం” అంశాన్ని భద్రతా సమితికి నివేదించిన ఐ.ఎ.ఇ.ఎ

అమెరికా, ఐరోపాల జేబు సంస్ధ అయిన “అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ” (ఐ.ఎ.ఇ.ఎ) సిరియా అణు విధానంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. భద్రతా సమితిలో వీటో అధికారం కలిగి ఉన్న చైనా, రష్యా లు సిరియా అంశాన్ని భద్రతా సమితికి నివేదించడానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాల ఐ.ఎ.ఇ.ఎ బోర్డు 17 – 6 ఓట్ల తేడాతో తీర్మానాన్ని ఆమోదించింది. 12 దేశాలు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇరాన్ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం భద్రతా సమితికి నివేదించాక ఐ.ఎ.ఇ.ఎ మరోదేశ అణు విధానాన్ని భద్రతా సమితికి నివేదించడం ఇదే మొదటిసారి. సిరియా రహస్యంగా అణ్వాయుధం కోసం ప్రయత్నిస్తున్నదని అమెరికా యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అవి ఇప్పటికే సిరియా, సిరియా అధ్యక్షుడి పైనా వాణిజ్య ఆంక్షలు విధించాయి.

సిరియాలోని దాయిర్ ఆల్‌జౌర్ కాంప్లెక్సులో అణ్వాయుధం నిర్మించడానికి ఇంధనం శుద్ధి చేస్తున్నదని ఆరోపిస్తూ 2007 లో ఇజ్రాయెల్ బాంబులు వేసి ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ చర్యను ప్రశ్నించిన వారు లేరు గానీ ధ్వంసం అయిన భవనంలో ఉత్తర కొరియా సహాయంతో యురేనియం శుద్ధి చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ నాలుగు సంవత్సరాల తర్వాత సిరియాపై వాణిజ్య ఆంక్షలకు సిద్ధపడటం పశ్చిమ దేశాల తెంపరితనాన్ని సూచిస్తోంది. అమెరికా గూఢచర్య సంస్ధలు ఆల్ జౌర్ లో బహుశా ప్లుటోనియం శుద్ధి చేస్తూ ఉండవచ్చని చెబుతున్నాయి.

సిరియాపైన ఏక పక్షంగా ఆరోపణలు చేసి ఆరోపణలు నిజం కాదని నిరోపించుకునే  భారాన్ని సిరియాపైనే మోపాయి పశ్చిమ దేశాలు.

About these ads

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

సమాచారం

This entry was posted on జూన్ 10, 2011 by in ఇతరములు and tagged .

మార్గదర్శిని

తెలుగులో వ్యాఖ్యలు రాయాలా?

తెలుగులో వ్యాఖ్య రాయడానికి ఈ కింద లింక్ క్లిక్ చేయండి.

lekhini.org.

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

మరో 341గురు చందాదార్లతో చేరండి

కూడలి

కేటగిరీలు

బ్లాగ్ గణాంకాలు

  • 423,453 సార్లు

క్యాలెండరు

జూన్ 2011
సో మం బు గు శు
« మే   జూలై »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

బ్లాగ్మిత్రులు

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 341గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: