“పికాసో ఆఫ్ ఇండియా” ఎం.ఎఫ్.హుస్సేన్ కు సైకత శిల్పి నివాళులు -ఫోటో
అలహాబాద్ కి చెందిన సైకత శిల్పి “పికాసో ఆఫ్ ఇండియా” కు తన శైలిలో జోహార్లు అర్పిస్తున్న దృశ్యం
అలహాబాద్ కి చెందిన సైకత శిల్పి “పికాసో ఆఫ్ ఇండియా” కు తన శైలిలో జోహార్లు అర్పిస్తున్న దృశ్యం
దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి…
సర్ఫరాజ్ షా అనే పేరుగల యువకుడిని పాకిస్ధాన్ పారామిలట్రీ రేంజర్స్ కి చెందిన పోలీసులు, అతను ఓ వైపు దీనంగా బతిమాలుతున్నప్పటికీ క్రూరంగా కాల్చి చంపిన దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు. పోలీసులకి, సైనికులకి అధికారం అప్పగిస్తే ప్రజలు ఏం అనుభవించాల్సి వస్తుందో ఈ వీడియో తెలియజెప్పుతోంది. పాక్ ప్రధాని యధావిధిగా, విచారించి దోషులను కఠినంగా శిక్షిస్తామని వాగ్దానం ఇచ్చేశాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మినవారెవరూ లేరని పత్రికలు ఘోషిస్తున్నాయి. http://in.reuters.com/video/2011/06/10/outrage-over-point-blank-teen-killing-in?videoId=212787889&videoChannel=101
ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి బాగా తగ్గిపోయింది. దానితో భారత దేశ ఆర్ధిక వృద్ధిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గక పోవడం, ద్రవ్యోల్బణం కట్టడికోసం బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు ఖరీదు పెరగడం వల్లనే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోయిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదలవలన రిజర్వు బ్యాంకు ఇక ముందు వడ్డీ రేట్లను పెంచడానికి అంతగా సుముఖంగా ఉండక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పారిశ్రామిక పారిశ్రామిక…
అమెరికా, ఐరోపాల జేబు సంస్ధ అయిన “అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ” (ఐ.ఎ.ఇ.ఎ) సిరియా అణు విధానంపై ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. భద్రతా సమితిలో వీటో అధికారం కలిగి ఉన్న చైనా, రష్యా లు సిరియా అంశాన్ని భద్రతా సమితికి నివేదించడానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. 35 దేశాల ఐ.ఎ.ఇ.ఎ బోర్డు 17 – 6 ఓట్ల తేడాతో తీర్మానాన్ని ఆమోదించింది. 12 దేశాలు ఓటింగ్ నుండి విరమించుకున్నాయి. ఇరాన్ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం భద్రతా…
సేమౌర్ హెర్స్ ఇంకా ఇలా రాశాడు. “అయితే అమెరికాకి చెందిన అత్యంత ఉన్నత స్ధాయి రహస్య గూఢచార నిర్ధారణలతో సహా పెద్ద పెద్ద సాక్షాలు (large body of evidence) అమెరికా సద్దామ్ హుస్సేన్, ఇరాక్ ల విషయంలో ఎనిమిది సంవత్సరాల క్రితం చేసిన తప్పులాంటి తప్పునే మళ్ళీ ఇరాన్ విషయంలోనూ చేసే ప్రమాదంలో ఉందని సూచిస్తున్నాయి. ఒక నిర్భంధ పాలకుడి విధానాలపై ఉన్న ఆత్రుతకొద్దీ ఆ ప్రభుత్వ మిలట్రీ సామర్ధ్యాలూ, ఉద్దేశాలపైన మన అంచనాలు తప్పు…