అమెరికా ప్రత్యేక దళాలను దేశంనుండి పంపించిన పాక్ ప్రభుత్వం

మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చే పేరుతో పాకిస్ధాన్ లో తిష్ట వేసిన అమెరికా ప్రత్యేక బలగాలను లేదా సి.ఐ.ఏ గూఢచారులను బాగా తగ్గించాలని పాక్ ప్రభుత్వం గత కొన్ని వారాలనుండి అమెరికాను కోరుతూ వచ్చింది. ఈ విషయమై ఇరు దేశాల మిలట్రీ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పాకిస్ధాన్ లో ఉన్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 90 మందిని అమెరికాకి తిప్పి పంపినట్లుగా పాక్ ప్రభుత్వం…

“రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరాహార దీక్షలో అన్నా హజారే

చెప్పినట్లుగానే అన్నా హజారే ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభమయ్యింది. వేలమంది అనుచరులు, ఆసక్తిపరులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన మద్దతుదారులతోహజారే తన ఒక రోజు నిరసన దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగాశాంతియుత దీక్షకు దిగిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల చేత దాడిచేయించి, లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం జరిపించడానికి వ్యతిరేకంగాహజారే బుధవారం దీక్షను తలపెట్టారు. మొదట తన దీక్ష జంతర్ మంతర్ వద్దజరుగుతుందని అన్నా చెప్పినప్పటికీ ప్రభుత్వం అందుకు అనుమతి నిరాకరించడంతోతన శిబిరాన్ని…

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట…