సుష్మ స్వరాజ్ కంటే మా నాన్నగారే బాగా డాన్స్ చేస్తారు -కాశ్మీరు ముఖ్యమంత్రి

ఆమరణ నిరాహార దీక్ష చేయబోయిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి అరెస్టు చేసి ఆయన మద్దతుదారులపై లాఠీ ఛార్జీ చేసినందుకు నిరసనగా బి.జె.పి సోమవారం మహాత్మా గాంధీ సమాధి “రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరసన తెలిపిన సంగతి విదితమే. తెల్లవారు ఝామున బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తమ కార్యకర్తల ముందు నాట్యం చేసి పత్రికల పతాక శీర్షికలకెక్కారు. జాతిపిత మహాత్మగాంధి సమాధి వద్ద ప్రతిపక్షాల నాయకురాలు నాట్యం చేయడం కాంగ్రెస్…

చిలీలో పుయేహూ అగ్ని పర్వతం బద్దలై లావా బూడిదను ఎగజిమ్ముతున్న దృశ్యం -ఫోటో

జూన్ 5, 2011 తేదీన చిలీ దేశంలోని “పుయేహూ” అగ్ని పర్వతం బద్దలయ్యింది. దాంతో అగ్ని పర్వతం చుట్టూ 70 కి.మీ పరిధిలో నివసిస్తున్న వారు ఇళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది. దక్షిణ చిలీలోని ఓసోర్నో పట్టణానికి సమీపంలో ఈ అగ్ని పర్వతం ఉంది. చిలీ రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 870 కి.మీ దూరంలో ఉన్న ఈ పర్వతం గత యాభై సంవత్సరాల్లో బద్దలవడం ఇదే మొదటిసారి. పేలుడు ధాటికి బూడిద పక్కనే…

ఇజ్రాయెల్ దాష్టీకంపై నిరసనలో పాలస్తీనా బాలుడు! -ఎ.ఎఫ్.పి ఫోటో

పాలస్తీనా భూభాగం నుండి, వారి ఇండ్లనుండి పాలస్తీనా కుటుంబాలను తరిమివేసి 63 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా, ఇంగ్లండుల ప్రత్యక్ష చర్యతో, ఇతర యూరప్ దేశాల పరోక్ష మద్దతుతో తమ తమ దేశాల్లో పదుల వందల ఏళ్ళ క్రితం తరలివచ్చి స్ధిరపడిన యూదు జాతి వారిని వదిలించుకోవడానికి పన్నిన చారిత్రక కుట్రే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సృష్టి. ఆనాటి జాతి హననంలో లక్షల పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం వెంటాడి వేటాడింది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక…

ఫుకుషిమా ప్రమాదంలో రేడియేషన్ అంచనాకు రెట్టింపుకంటె ఎక్కువే విడుదలైంది

ఫుకుషిమా అణు ప్రమాదం వలన వాతావరణంలో విడుదలైన రేడియేషన్ ఇప్పటివరకూ అంచనా వేసినదానికంటే రెట్టింపుకంటె ఎక్కువేనని ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న స్వతంత్ర నిపుణులతో కూడిన దర్యాప్తు సంస్ధ దర్యాప్తు ప్రారంభించడానికి ముందు జపాన్ అణు ఏజన్సీ వెల్లడించింది. అంతే కాకుండా మూడు రియాక్టర్లలో ఇంధన కడ్డీలు ఇప్పటిదాకా అనుకుంటున్న సమయానికంటే చాలా ముందుగానే కరిగి రియాక్టర్ల క్రింది బాగానికి చేరిందని ఏజెన్సీ చెబుతున్నది. వచ్చే జనవరిలోగా ఫుకుషిమా అణు కర్మాగారాన్ని మూసివేయోచ్చని అణు కర్మాగారం ఆపరేటర్ టోక్యో…