అమెరికాకు పాకిస్ధాన్ “తలాక్! తలాక్!! తలాక్!!!” చెప్పనున్నదా?

జరుగుతున్న పరిణామాలు అమెరికా పట్టునుండి పాకిస్ధాన్ జారిపోనున్నదా అన్న అనుమాలు కలగజేస్తున్నాయి. పాకిస్ధాన్ నుండి అమెరికా మనుషుల (ప్రత్యేక భద్రతా బలగాలు లేదా సి.ఐ.ఏ గూఢచారులు) సంఖ్యను సగానికి తగ్గించాల్సిందిగా పాకిస్ధాన్ మిలట్రీ అమెరికాను డిమాండ్ చేసింది. పాకిస్ధాన్ మిలట్రీ కోరిక మేరకు తమ పాకిస్ధాన్ నుండి తమ మనుషులను వెనక్కి పిలిపిస్తున్నామని అమెరికా కూడా ప్రకటించింది. “అనవసరమైన మనుషులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాకు సాయం చేయడానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారు”…

చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను…

ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…