అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -1

“Of the 1%, by the 1%, for the 1%” ఇది ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికా ఆర్ధిక శాస్త్రవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అమెరికా ప్రజల ఆర్ధిక స్ధితిగతులను వివరిస్తూ రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్. “డెమొక్రసీ ఆఫ్ ది ప్యూపుల్, బై ది ప్యూపుల్, ఫర్ ది ప్యూపుల్” అంటూ ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన దేశంలోని సంపద, ఆదాయాలు రెండూ అత్యున్నత స్ధానంలో ఉన్న ఒక శాతానికి మాత్రమే చేరుతున్నాయనీ, మధ్య తరగతివారు…

ఇండియాలో దరిద్రుల సంఖ్య లెక్కింపుకు ప్రభుత్వ నిర్ణయం

భారత దేశంలోని 120 కోట్లమంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు ఎంతమంది? ఈ ప్రశ్నకు అనేక జవాబులు ఉన్నాయి. ప్రభుత్వం 37 శాతం మంది దరిద్రులని చెబుతుంటే స్వతంత్ర అధ్యయనాల్లో ఒకటి 77 శాతం అని తెలిపింది. ఓ వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అని నిర్ధారించడానికి ఏర్పరిచిన ప్రాతిపదికల వలన ఇన్ని తేడాలు. ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి జీవనాధారాలు కల్పించి వారి పరిస్ధితులను మెరుగుపరచడం ద్వారా దరిద్రుల సంఖ్యని తగ్గించడానికి బదులు…

భూకంపం దెబ్బకి మళ్ళీ ఆర్ధిక మాంద్యంలోకి జారుకున్న జపాన్

ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు…

అమెరికాతో చెడిన నేపధ్యంలో చైనా కార్డుని ముందుకి తెస్తున్న పాకిస్ధాన్

ఒసామా బిన్ లాడెన్ ని హత్య చేయకముందు వరకూ ఏడు సంవత్సరాలనుండి అబ్బోత్తాబాద్ లోనే ఉంటున్నామని ఆయన భార్య చెప్పిన నేపధ్యంలో లాడెన్‌ని దాచిపెట్టడంలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఇంతకాలం లాడెన్ పాక్‌లో దాగి ఉండటం పాక్‌లోని కనీసం కొందరి అధికారులకైనా తెలియకుండా సాద్యం కాదని అమెరికా ప్రతినిధుల సభ అనుమానాలు వ్యక్తం చేసింది. పాక్‌కి అందిస్తున్న బిలియన్ డాలర్ల సహాయాన్ని రద్దు చేయాలని…