కటకటాల కాన్

డొమినిక్ స్ట్రాస్ కాన్. మొన్నటివరకూ సంక్షోభాల్లో ఉన్న అర్ధిక వ్యవస్ధలకు బిలియన్ల డాలర్ల అప్పుల సాయం ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతుడు. ప్రపంచ ఆర్ధిక సంక్షొభం పరిష్కారానికి జి-20 దేశాల కూటమితో కలిసి నిరంతరం కృషి చేసి సంక్షోభంలో ఉన్న మహా మహా దేశాలను ఓ ఒడ్డుకి చేర్చడానికి దోహద పడిన మేధావి. చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాల వాదనలకు దన్నుగా నిలబడిన ధ్వజ స్తంభం. అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన…

అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై…

“వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు

పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ దేశాన్ని స్దాపించాయి. లక్షలమంది పాలస్తీనీయులను వారి ఇళ్ళనుండి భూములనుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. వారికి పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, జోర్డాన్ లలో శరణార్ధులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించి అక్కడి పాలస్తీనియులను వెళ్ళగొట్టి సెటిల్‌మెంట్లను ఇప్పటికీ…

పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…

నాటో దాడులకు ఫలితం, గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్న గడ్డాఫీ?

లిబియాపై పశ్చిమ దేశాల దురాక్రమణ దాడులకు ఫలితం వస్తున్నట్టే కనిపిస్తోంది. లిబియాను 42 సంవత్సరాలనుంది ఏలుతున్న కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ ఎలాగూ తాను గద్దె దిగక తప్పదన్న అవగాహనతో గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్నాడని గడ్డాఫీ పాలనా బృందంలోని వారిని ఉటంకిస్తూ ‘ది గార్దియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. తాను నలభై సంవత్సరాలపాటు పాలించీన లిబియాలో ఒక గాడ్ ఫాదర్ లాంటి ఇమేజ్ తో పదవినుండి నిష్క్రమించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితుల్లో కనీసం నలుగురిని ఉటంకిస్తూ ఆ పత్రిక…