లాడెన్ హత్య చట్టబద్ధమేనని నిరూపించుకోవడానికి అమెరికా తంటాలు
నిరాయుధుడుగా ఉన్న లాడెన్‌ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని…