ఒసామా హత్యను నిర్ధారించిన ఆల్-ఖైదా, శవం అప్పగించాలని డిమాండ్
ఒసామా-బిన్-లాడెన్ నిజంగా అమెరికా కమెండోల దాడిలో చనిపోయాడా లేదా అన్న అనుమానాలకు తెర దించుతూ అతను చనిపోయిన విషయాన్ని ఆల్-ఖైదా సంస్ధ నిర్ధారించింది. లాడెన్ శవాన్ని అప్పగించాలని ఆల్-ఖైదా డిమాండ్ చేసింది. శవాన్ని అరేబియా సముద్రంలో పాతిపెట్టామంటున్న అమెరికా మాటలను ఆల్-ఖైదా నమ్మడం లేదని ఈ డిమాండ్ ద్వారా అర్ధం చేసుకోవచ్చునా లేక శవం పాతిపెట్టిన చోటుని చెప్పాలని ఈ డిమాండ్ అంతరార్ధమో తెలియడం లేదు. ఒసామా-బిన్-లాడెన్ హత్యకు అమెరికా పైనా, దాని మిత్రుల పైనా ప్రతీకారం…