అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు, అంచనా తగ్గించిన ఎస్ & పి

ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.…

జపాన్ పునర్నిర్మాణం ఖరీదు రు. 14 లక్షల కోట్లు

శక్తివంతమైన భూకంపం, వినాశకర సునామీల ధాటికి దెబ్బతిన్న ఈశాన్య జపాన్ ని పునర్నించడానికి 300 బిలియన్ డాలర్లు అవసరమని జపాన్ ప్రభుత్వం లెక్కగట్టింది. భూకంపం, సునామీల్లొ ఫుకుషిమా దైచి వద్ద అణు విద్యుత్ కర్మాగారం దెబ్బతిని అందులోని నాలుగు రియాక్టర్ల నుండి రేడియేషన్ వెలువడుతున్న విషయం విదితమే. ప్రమాద స్ధాయి అత్యధిక స్ధాయి 7 గా నిర్ణయించిన ఫుకుషిమా అణు ప్రమాదం నుండి ఆ ప్రాంతాన్ని బైట పడేయడానికి ఎంత కాలం పడుతుందో చెప్పడానికి అణు ప్ల్లాంటు…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…