జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని…

బ్యాంకు రిజర్వు రేట్లను మళ్ళీ పెంచిన చైనా

చైనా మరోసారి రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును పెంచింది. ద్రవ్యోల్బణం రికార్టు స్ధాయిలో 5.4 శాతానికి చేరుకోవడంతో చైనా మార్కెట్ల్లొ చలామణీలో ఉన్న డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు 20 శాతంగా ఉన్న రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును (ఆర్.ఆర్.ఆర్) 20.5 శాతానికి పెంచింది. వాణిజ్య బ్యాంకులు తాము సేకరించీన్ డిపాజిట్లలొ రిజర్వు డబ్బుగా అట్టి పెట్టవలసిన డబ్బు శాతాన్ని రిజర్వు రిక్వైర్ మెంటు శాతం అంటారు. ఇండియాలొ దీన్ని సి.ఆర్.ఆర్ (క్యాష్ రిజర్వు రేషియో)…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…