ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా,…

సెజ్ లపై త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు

సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా…

ప్రజల డాక్టరు డా.బినాయక్ సేన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

సెడిషన్ ఆరోపణలపై యావజ్జీవ శిక్షను ఎదుర్కొంటున్న డాక్టర్ బినాయక్ సేన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ పై విడుదల చేసింది. “మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ. ఆయన మావోయిస్టులకు సానుభాతిపరుడు మాత్రమే. అంతమాత్రాన ఆయనను సెడిషన్ ఆరోపణల కింద దోషిగా నిర్ధారించలేము.  సానుభూతిపరుడు తప్ప అంతకంటే ఏమీకాదు” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోంది. బినాయక్ సేన్ విడుదల వార్త తెలిస్తే ఆయన వైద్య సేవ చేసిన చత్తీస్ ఘడ్ లోని గిరిజన తెగల ప్రజలు…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…