మీరు లిబియన్లపై బాంబులేసుకొండి, మేం మా ప్రజల్ని చంపుకుంటాం -అమెరికా, సౌదీఅరేబియాల అనైతిక ఒప్పందం

ఒకరి దారుణాలను మరొకరు ఖండించుకోకుండా అమెరికా, సౌదీ అరేబియాల మధ్య అనైతిక ఒప్పందం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ నిజం అరబ్ ప్రపంచానికి చెందిన వార్తా సంస్ధలకు ఎప్పుడో ఉప్పందింది. అరబ్, ముస్లిం ప్రపంచంలోని ప్రముఖ బ్లాగర్లు బైట పెట్టే వరకూ ఈ దారుణం ప్రపంచానికి తెలియలేదు. లిబియా పౌరులను గడ్డాఫీ సైన్యాలు చంపుతున్నాయంటూ కాకి గోల చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర పశ్చిమ దేశాలు బహ్రెయిన్, యెమెన్ ల ప్రభుత్వాధిపతులు అక్కడ…

బహ్రెయిన్ చీకటి రహస్యం -వీడియో

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఉద్యమించి నియంతృత్వ పాలకులను పదవీచ్యుతులను చేశాక ఆ దేశాల స్ఫూర్తితో ప్రజాందోళనలు మొదలైన అరబ్ దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ రాజు వెంటనే గద్దె దిగాలని బహ్రెయిన్ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. మొదట మళ్లీ పోటీ చేయననీ, 2013 లో తన పదవీ కాలం ముగిశాక ఇతరులకు అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చినా ప్రజలు అంగీకరించలేదు. ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటించీన లొంగలేదు.…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిస్తాం -పశ్చిమ దేశాలు

లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన…

సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…