బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…

చైనాలో ప్రదర్శనకు పిలుపు, ఉక్కుపాదం మోపిన చైనా పోలీసులు

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలు చైనా ప్రభుత్వానికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. ఆదివారం ట్యునీషియా తరహాలో చైనాలోని బీజింగ్, షాంగై నగరాల్లో జాస్మిన్ గేదరింగ్ జరపాలని అమెరికానుండి నిర్వహించబడుతున్న ఒక వెబ్ సైట్ చేసిన ప్రచారానికి ఎవరూ గుమిగూడకుండా చైనా పోలీసులు కట్టుదిట్టం చేశారు. విదేశీ విలేఖరులను కూడా వదల కుండా కెమెరాలను లాక్కొని ఫోటోలను తొలగించారు. ప్రదర్శన కోసం పిలుపునిచ్చిన ప్రాంతంలో ఎవరూ ఎక్కువ సేపు ఆగకుండా చీపుర్లతో…

దక్షిణ కొరియా మానసిక ప్రచారానికి ప్రతిగా ఉత్తర కొరియా మిలట్రీ చర్య హెచ్చరిక

  అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం చెలరేగుతున్న తిరుగుబాట్ల గురించి సమాచారం ఉన్న కర పత్రాలను ఉత్తర కొరియాలో జారవిడవడం ఆపకపోతే దక్షిణ కొరియాపై మిలట్రీ చర్య తీసుకోవలసి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా తన పౌరులకు బయటి ప్రపంచం నుండి ఎటువంటి సమాచారం అందకుండా గట్టి చర్యలు తీసుకొంటుంది. బయటి దేశాలకు ఫోన్ సౌకర్యాలను సైతం అనుమతించదు. దానితో ఉత్తర కొరియా ప్రజలకు ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ తెలిసే అవకాశం లేదు.…

రెండో రోజూ కొనసాగిన ట్యునీషియా ప్రదర్శనలు

శుక్రవారం “ఆగ్రహ దినం” గా పాటిస్తూ రాజధాని ట్యునిస్ లో లక్ష మందితో సాగిన ప్రజా ప్రదర్శనలు శనివారం కూడా కొన సాగాయి. శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు జరిపారు. ప్రదర్శకుల రాళ్ళ దాడిలో పోలీసులు కూడ గాయ పడ్డారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన మంత్రి గా ఉన్న ఘన్నౌచీ రాజీనామా కోరుతూ ట్యునీషియా ప్రజలు ఆందోళనలు జరుపుతున్నారు. కొంతమంది రాజధాని ట్యునిస్ లో గుడారాలు వేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి, పదవీచ్యుతుడైన…

లిబియాపై ఆంక్షలను ఆమోదించిన భద్రతా సమితి

ఐక్యరాజ్య సమితిలో శక్తివంతమైన సంస్ధ ఐన భద్రతా సమితి లిబియా పై ఆంక్షలు విధిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దానితో పాటు లిబియా పౌరులపై సైనికులు పోలీసులచేత విమాన దాడులు చేసినందుకు గడ్డాఫీపై “మానవతపై నేరపూరిత దాడులు” (క్రైమ్స్ ఎగైనెస్ట్ హ్యూమానిటీ) చట్టం కింద విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సిఫారసు చేస్తూ ఆమోదించింది. అటువంటి సిఫారసు తర్వాత తమను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుందని కొంతమంది సంశయించినప్పటికీ చివరికి ఆమోదముద్ర వేశారు.  చైనా అభిప్రాయంపై అనుమానాలు…

మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యునీషియా ప్రజల భారీ ప్రదర్శన

  ప్రజల తిరుగుబాటుతో దేశం వదిలి పారిపోయిన ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీ మద్దతుదారులే తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుండడంతో మొదటినుండి నుండి అసంతృప్తితో ఉన్న ట్యునీషియా ప్రజలు తాత్కాలిక ప్రధాన మంత్రి మహమ్మద్ ఘన్నౌచీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజధాని ట్యునీస్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బెన్ ఆలీ ప్రభుత్వంలో ఉన్నవారెవరూ ప్రభుత్వంలో ఉండకూడదని ప్రజలు మాజీ అధ్యక్షుడు సౌదీ అరేబియా పారిపోయిన దగ్గర్నుండీ డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ…

లిబియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం, ఆంక్షలు విధించిన అమెరికా

  లిబియాలో గడ్డాఫీ మద్దతుదారులకూ వ్యతిరేకులకూ మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది. గడ్డాఫీ వ్యతిరేకులు క్రమంగా రాజధాని ట్రిపోలిని సమీపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రిపోలీ పైనే ఇప్పుడు అటు ఆందోళనకారులూ, ఇటు గడ్డాఫీ ప్రభుత్వ బలగాలూ కేంద్రీకరించాయి. రాజధాని ఆందోళనకారుల వశం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ట్రిపోలీని పట్టుకొని గడ్డాఫీనీ అతని అనుకూలురనూ తరిమివేయాలని తిరుగుబాటుదారులు చూస్తున్నారు. గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుకు ఒసామా బిన్ లాడెన్ పూర్తి మద్దతు ఉందని గడ్డాఫీ ప్రకటించాడు. ముస్లిం తీవ్రవాదులుగా అమెరికా ముద్ర…

రైల్వేల ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపిన మమత రైల్వే బడ్జెట్

పాపులిస్ట్ నినాదాల మాటున మమత రైల్వే బడ్జెట్, రైల్వేల రంగంలో ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది. ప్రైవేటీకరణ గాయత్రీ మంత్రంగా మారిన ఈ రోజుల్లో పాపులర్ బడ్జెట్లు విమర్శలు ఎదుర్కొంటున్నట్లే మమత గారి కొత్త రైల్వే బడ్జెట్ కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పండితులనుండి విమర్శలను ఎదుర్కొంటోంది. మమత మాత్రం “మానవీయ ముఖం (తొడుగు లేదా మాస్క్ అంటే సరిగ్గా సరిపోతుంది) తో ఆర్ధిక వ్యవస్ధ మెరుగుదలకు దోహదం చేసే బడ్జెట్ నాది,” అని అభివర్ణించింది. వచ్చే…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…

రానున్నది జన రంజక బడ్జెట్టేనట!

  మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం…

గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ ను స్వీడన్ కు అప్పగించడానికి బ్రిటన్ కోర్టు ఆమోదం

  వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కు ప్రపంచ వ్యాపింతంగా ఉన్న అభిమానులకు నిరాశ కలిగిస్తూ బ్రిటన్ కోర్టు అతనిని స్వీడన్ పోలీసులకు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. స్వీడన్ లో తనకు నిష్పక్షపాత న్యాయం దొరకదని జులియన్ వాదించినప్పటికీ కోర్టు అంగీకరించ లేదు. అయితే కోర్టు రూలింగ్ పై అప్పీలుకు వెళ్ళటానికి జులియన్ నిర్ణయించుకున్నట్లుగా అతని లాయర్లు తెలిపారు. స్విడన్ లో రేప్ చట్టాలు స్త్రీలకు మనోభావాలకు అనుగుణంగా సున్నితంగా ఉంటాయన్న పేరుంది. సహచరి అయినప్పటికీ…

ధాన్యం ఎగుమతికి వ్యవస్యాయ మంత్రి శరద్ పవార్ అత్యుత్సాహం

  రెండున్నర సంవత్సరాల నుండి ధాన్యం ధరలు చుక్కల్లో కొనసాగుతుండటం వలన ఆహార ద్వవ్యోల్బణం, దానివల్ల ప్రదాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ, దాన్ని తగ్గించే విషయం ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్, ఇప్పుడు దేశంలోని ధాన్యాన్ని ఎగుమతి చేయటానికి మాత్రం తెగ ఉత్సాహపడి పోతున్నాడు. అంతర్జాతీయంగా బియ్యం, గోధుమల ధరలు పెరగడంతో, పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటానికి ఇదే మంచి సమయమని ఆయన బుధవారం ప్రకటించాడు. ఇప్పుడు ఎగుమతి చేస్తే…

పతనం బాటలో గడ్డాఫీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మధ్య విభేదాలు?

  కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ రోజు రోజుకీ ఒంటరి అవుతున్నాడు. విదేశీ రాయబారుల్లో చాలామంది గడ్డాఫీకి ‘బై’ చెప్పేశారు. ప్రజలపై హింస ఆపమని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులవి న్యాయమైన్ డిమాండ్లు, వాటిని ఒప్పుకొని దిగిపో అని సలహా ఇస్తున్నారు. గడ్డాఫీ అనుకూల సైనికులు వీధుల్లో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 1,000 మంది పౌరులను చనిపోయారని ఇటలీ విదేశాంగ మంత్రి ఫ్రాట్టిని ప్రకటించాడు. వ్యాపార సంబంధాల వలన లిబియాలో ఉన్న తమ పౌరులను అక్కడినుండి ఖాళీ చేయించడానికి త్వరపడుతున్నారు.…

రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే

సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి. 30 షేర్ల…